twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సొంత కుంపటి.. ఆ బ్యానర్‌ను పక్కన పెట్టేసి త్రివిక్రమ్‌తో..

    |

    నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్ నటుడిగా రాణిస్తూనే స్వయంగా సినిమాలు కూడా నిర్మించడం తెలిసిందే. తమ తాతగారైన నందమూరి ఎన్టీఆర్ రామారావు (ఎన్టీఆర్) పేరిట ఉన్న బ్యానర్‌పై పలు సినిమాలు రూపొందించారు. నిర్మాతగా అతనోక్కడేతో ప్రారంభమైన కల్యాణ్ ప్రయాణం పటాస్, కిక్ 2, ఇజం, జై లవకుశ వరకు నిర్విరామంగా సాగింది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ బ్యానర్‌ను ఇటీవల మూసేయడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. ఇంతకు బ్యానర్ ఆపివేయడం వెనుక అసలు విషయం ఏమిటంటే..

    ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై

    ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై


    ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తీసిన సినిమాలు లాభాలను తెచ్చిపెట్టడం కంటే నష్టాలను ఎక్కువగా తెచ్చిపెట్టాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటాయి. అయితే చివరగా జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన జై లవకుశ రికార్డు స్థాయి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఇలాంటి బ్యానర్‌ లోగో నుంచి బసవతారకం ఫోటోను తీసేయడం, అలాగే ఆ బ్యానర్‌పై సినిమాలు ఆపేయాలని నిర్ణయం తీసుకోవడం చర్చానీయాంశమైంది.

    సోదరుడితో కలిసి ఎన్టీఆర్ కొత్త బ్యానర్

    సోదరుడితో కలిసి ఎన్టీఆర్ కొత్త బ్యానర్

    సోదరుడు కల్యాణ్ రామ్‌ను నిర్మాతగా నిలబెట్టాలనే టార్గెట్‌తో ఎన్టీఆర్ ఉన్నారని.. ఆ క్రమంలో ఇద్దరు కలిసి ఓ కొత్త బ్యానర్‌ను ఏర్పాటు చేశారని తాజా సమాచారం. తన తదుపరి సినిమాకు సంబంధించిన విషయంలో కల్యాణ్ రామ్ నిర్మాతగా ఉండేలా ఎన్టీఆర్ చర్యలు తీసుకొంటున్నట్టు తెలిసింది.

    త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మూవీ

    త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మూవీ

    అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం RRR. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది కాలంగా సాగుతున్నది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాను త్రివిక్రమ్ అధికారికంగా కూడా ప్రకటించారు. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

    నిర్మాతగా కల్యాణ్ రామ్

    నిర్మాతగా కల్యాణ్ రామ్


    ఇక ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సొంతంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై త్రివిక్రమ్‌తో చేసే ప్రాజెక్టు నిర్మించాలనే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టులో కల్యాణ్ రామ్ భాగస్వామిగా ఉంటారనేది ఫిలింనగర్ టాక్. ఎన్టీఆర్ బ్యానర్ స్థానంలో కొత్త బ్యానర్‌ ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయం అంతు చిక్కకుండా ఉంది.

    English summary
    Prestigious banner NTR Arts is going to be scrapped. Reports suggest that Junior NTR and Kalyan Ram to Establish new banner. With new banner, Kalyan Ram will be one of the producers for Trivikram and NTR movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X