ఎన్టీఆర్ 'దమ్ము'లో పోలీస్ అధికారిగా..
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అందులో ఒక డైలాగు కూడా నెట్ లో బాగా పాపులర్ అవుతోంది. ఆ డైలాగులో... వితౌట్ ఖాకీ లో ఉంటే కూల్ గా ఉంటా, విత్ ఖాకీ లో ఐతే కుమ్మెశేలా ఉంటా.. అంటాడు. అప్పుడు విలన్.. ఎవడ్రా నువ్వు అంటాడు. దానికి ఎన్టీఆర్ వెంటనే కౌంటర్ గా...డిపార్ట్‌మెంట్ లో అందరు టైగర్ అంటారు.. బయట అందరు యంగ్ టైగర్ అంటారు అని చెప్తాడు. ఈ డైలాగు విన్నవారంతా అది ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా చెప్పే డైలాగు అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి తన పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. త్రిష, కార్తిక హీరోయిన్స్ గా సెట్ కావటంతో ఇక అడ్డంకులేమీ లేకుండా స్మూత్ గా షూటింగ్ జరిగేందకు నిర్మాతకు సహకరిస్తూ బోయపాటి శ్రీనుతో ఓ రేంజి అవుట్ పుట్ తీసుకుంటున్నాడని వినపడుతోంది. ఇక దమ్ము చిత్రం 2012 వేసవిలో ఓ బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.
అలాగే ఈ చిత్రం కథలో ఆ రేంజి పొటిన్షియల్ ఉందని, సింహా.. బాలకృష్ణకి ఎలాగో తనకు దమ్ము అలాగే తన కెరీర్ కి ఊతమిస్తుందని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాని పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో బోయపాటి ఉన్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ పై సుమారు సంవత్సరం పాటు బోయపాటి కృషి చేశారని చెప్తున్నారు. ఎన్టీఆర్ తల్లిగా ఈ సినిమాలో భానుప్రియ బావ క్యారక్టర్ కు హీరో వేణును ఎంపిక చేసారు. ఇక తాత క్యారక్టర్ కు కోట శ్రీనివాసరావు కన్ ఫార్మ్ అయ్యారని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











