'బాద్‌షా' రన్ టైమ్ ఎంతంటే
హైదరాబాద్ : ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' చిత్రం ఈ వేసవిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అయిన ఈ చిత్రం రన్ టైమ్ రెండు గంటల 35 నిముషాలు అని తెలుస్తోంది. చిత్రం ఫస్ట్ హాఫ్...గంట 16 నిముషాలు ఉండగా..సెకండ్ హాఫ్ ...గంట 19 నిముషాలు ఉండబోతోంది. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా దర్శక,నిర్మాతలు ఈ చిత్రాన్ని చెప్తున్నారు.
ఇక వేసవిలో విడుదల కానున్న బాద్‌షా సినిమా ఎన్టీఆర్‌కు అతిపెద్ద మైలురాయిగా నిలుస్త్తుందని రచయిత కోన వెంకట్ తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో కోన ప్రభాకరరావు నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16వ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటక పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'బాద్‌షా' సమ్మర్‌లో వచ్చే సునామీ అని అన్నారు. 'బాద్‌షా' అనేది ఎన్టీఆర్ తనపై పెట్టిన బాధ్యత అని అన్నారు.
వచ్చే నెల 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయటానికి నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించారు.
''ఎన్టీఆర్‌లోని నటుణ్ని కొత్త తరహాలో చూడొచ్చు. ఆయన గెటప్, పలికే సంభాషణలు అందర్నీ అలరిస్తాయి. ఈ చిత్రానికి మహేష్‌బాబు వాయిస్ ఓవర్ చెప్పడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన వస్తోంది. తమన్ స్వరాలు ఎన్టీఆర్ అభిమానులకు బాగా నచ్చాయి. ఈ నెలాఖరున ప్లాటినం డిస్క్ కార్యక్రమం నిర్వహిస్తాము''అన్నారు


Click it and Unblock the Notifications











