హాట్ టాపిక్ : ఎన్టీఆర్ 'బాద్‌షా' కథ ఇదేనా...!?

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కథ లీకైందంటూ గత కొద్ది రోజులుగా నెట్ లో వార్తలు వస్తున్నాయి. ఏప్రియల్ 5 న విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని చెప్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో కనపడతారని వినపడుతోంది.

నెట్ లో హల్ చల్ చేస్తున్న లీకైందంటూ వస్తున్న కథ ఏమిటంటే..... స్పెయిన్ లో మాఫియా లీడర్ ముఖేష్ కొడుకు నవదీప్. ఇతను కాజల్ తో ప్రేమలో పడతాడు. అయితే కాజల్ గురించి పూర్తి సమాచారం సేకరించమని డిటెక్టివ్ ఏజన్సీని సంప్రదిస్తాడు. అక్కడ డిటెక్టివ్ మరెవ్వరో కాదు ఎన్టఆర్. అక్కడ నుంచి ఎన్టీఆర్..కాజల్ వెనక పడుతూంటాడు.

మరో ప్రక్క చదువు పూర్తిచేసుకున్న కాజల్..ఇండియాకు చేరుకుంటుంది. ఆమెతో పాటు నవదీప్ ఖర్చుతో ఎన్టీఆర్ కూడా ఇండియాకు చేరుకుంటాడు. ఇండియాలో ఆల్రెడీ కాజల్ ని అజయ్ ప్రేమిస్తూంటాడు. అతను ఆమెపై యాసిడ్ దాడికి ప్రయత్నిస్తాడు., ఆ దాడి నుంచి రక్షించిన ఎన్టీఆర్ ఆమెకు దగ్గరవుతాడు. అయితే ఆ తర్వాత ట్విస్ట్ ఎన్టీఆర్ మాఫియాకు చెందిన వాడని. ఇదిలా ఉండగా ఇండియాలో ఉన్న కాజల్ తల్లితండ్రలు ఆమెను సిద్దార్దకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేసాడు..అసలు ఎన్టీఆర్ ఈ డిటెక్టివ్,మాఫియా గెటప్ ల వెనక ఉన్న మర్మమేమిటి అనేది మిగతా కథ. అయితే ఇది కరెక్టు కధా కాదా అన్నది సినిమా విడుదల అయితే కానీ తెలియదు.

ఇక ఈ చిత్రం కోసం తమిళ హీరో శింబు ఓ పాటను ఆలపించారు. 'డైమండ్‌ గాళ్‌..' అంటూ సాగే హుషారైన పాటను ఆయన పాడారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. 'బ్యాక్‌ బెంచ్‌ స్డూడెంట్‌' చిత్రం కోసం కూడా శింబు గాయకుడి అవతారం ఎత్తారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే 'బాద్‌ షా' కోసం శింబు పాట పాడేందుకు అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే నెలలో 'బాద్‌షా' పాటల్ని విడుదల చేస్తారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X