బాబాయ్, అబ్బాయిల మధ్య టీజర్ వార్
హైదరాబాద్ : కొత్త సంవత్సరం ని పురస్కరించుకుని బాబాయ్..బాలకృష్ణ తన తాజా చిత్రం లయిన్ టీజర్ ని, అబ్బాయి ఎన్టీఆర్ తన తాజా చిత్రం టెంపర్ టీజర్ ని విడుదల చేసారు. ఇప్పుడు ఈ రెండు టీజర్స్ మధ్య సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వార్ మొదలైంది. ఎవరి అభిమానులు వారు తమ హీరోనే ఇరగతీసాడంటూ ప్రమోట్ చేస్తున్నారు. యూ ట్యూబ్ లో నూ ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది.
https://www.facebook.com/TeluguFilmibeat
డిసెంబరు 31... మరి కాసేపట్లో కొత్త ఏడాది సంబరాలు మొదలైపోతాయి అనగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ.. అబ్బాయ్ ఎన్టీఆర్‌లు సందడి చేశారు. తమ తొలి ప్రచార చిత్రాలతో అభిమానుల్ని అలరించారు. నూతన సంవత్సర సందడి అభిమానులకు ముందే తెచ్చేశారు. బాలకృష్ణ 'లయన్', ఎన్టీఆర్ 'టెంపర్' చిత్రాల ఫస్ట్‌లుక్ టీజర్లు నూతన సంవత్సర కానుకలుగా అభిమానుల ముందుకొచ్చాయి. 'కొందరు కొడితే..' అంటూ బాలయ్య గర్జిస్తే... 'ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ తన టెంపర్ చూపించాడు.

' డిసెంబరు 31 రాత్రి 11 గంటల 15 నిమిషాలకు 'లయన్' తొలి ప్రచార చిత్రం విడుదల చేశారు. 'కొందరు కొడితే ఎక్సరేలో కనిపిస్తుంది. మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది. నేను కొడితే చరిత్రలో వినిపిస్తుంది' అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అలరించారు. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. మణిశర్మ స్వరాలు అందించారు. ఫిబ్రవరి చివరి వారంలో లేదంటే మార్చి నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
దయాగాడి 'టెంపర్': 'లయన్' ప్రచార చిత్రం విడుదలైన కాసేపటికే ఎన్టీఆర్ తన 'టెంపర్' చూపించాడు. 'ఇద్దరు కొట్టుకొంటే యుద్ధం. అదే ఒకడు మీద పడిపోతే అది దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర'అంటూ డైలాగ్‌ను తూటాలా పేల్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ స్వరాలు అందిస్తున్నారు. ఈనెల 20 వరకూ జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో 'టెంపర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఇంతకీ మీకు ఈ రెండు టీజర్స్ లో ఏది బాగా నచ్చిందో చెప్పండి...


Click it and Unblock the Notifications











