twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్.. బాలకృష్ణగా జూ. ఎన్టీఆర్.. సెన్సేషనల్‌గా..

    By Rajababu
    |

    Recommended Video

    NTR Biopic : A New Announcement On Bala Krishna's Character

    టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి బయటకు వస్తున్న విషయాలు చిత్రంపై ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, సూపర్‌స్టార్ కృష్ణగా మహేష్ నటిస్తున్నారనే అంశాలతో ఎన్టీఆర్ బయోపిక్ ప్రత్యేకంగా మారింది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం కొన్ని విషయాల్లో స్పష్టీకరణ లేకపోవడంతో నిజమా? గాసిప్ అనే విషయంపై క్లారిటి కొరవడింది.

    బాలయ్యగా ఎన్టీఆర్

    బాలయ్యగా ఎన్టీఆర్

    తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేయనున్నారు. ఎన్టీఆర్ జీవితంలో బాలకృష్ణ పాత్ర కూడా చాలా కీలకమైనదే. అయితే బాలకృష్ణ పాత్రను ఎవరు చూస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే బాబాయ్ బాలయ్యగా ఎన్టీఆర్ నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

    బాలకృష్ణ సుముఖంగా

    బాలకృష్ణ సుముఖంగా

    బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్‌ను నటింపజేయాలన్న ప్రతిపాదనను దర్శకుడు క్రిష్ తెరపైకి తీసుకురాగా, అందుకు బాలకృష్ణ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే బాలకృష్ణగా ఎన్టీఆర్ చేయడానికి సిద్ధపడుతాడా అనే విషయంపై ఓ అంచనాకు రావడం కష్టమే. బాలకృష్ణగా ఎన్టీఆర్ చేస్తే నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పవచ్చు.

    ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్

    ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్

    ఎన్టీఆర్ జీవితమంటే కేవలం సినిమానే కాదు.. రాజకీయ జీవితం కూడా చాలా ప్రతిష్టతో కూడుకొన్నది. పొలిటికల్ స్టోరికి తగినట్టుగా చంద్రబాబు పాత్రను రానా దగ్గుబాటి, హరికృష్ణగా కల్యాణ్ రామ్ నటించనున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుది కీలకమైన పాత్రే.

    కేసీఆర్ పాత్ర కీలకంగా

    కేసీఆర్ పాత్ర కీలకంగా

    గండిపేట ఆశ్రమంలో నిర్వహించిన రాజకీయ సదస్సులో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ పాఠాలు చెప్పేవారని రాజకీయవర్గాల్లో చెప్పుకొంటారు. నైజాం ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై ఆదరణ పెరగాలంటే కేసీఆర్ పాత్రను పరిచయం చేయాల్సిందే. ఒకవేళ కేసీఆర్ పాత్రను చూపిస్తే ఆ పాత్రను ఎవరు చేస్తారు? ఎవరైతే బాగుంటుందనే చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

    రాకెట్ స్పీడ్‌తో ఎన్టీఆర్ బయోపిక్

    రాకెట్ స్పీడ్‌తో ఎన్టీఆర్ బయోపిక్

    తేజను తప్పుకోవడంతో క్రిష్ జాగర్లముడి దర్శకుడిగా రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ బయోపిక్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. పాత్రల ఎంపికలో క్రిష్ చాలా వినూత్నశైలిని ఎంపిక చేయడం అంచనాలు పెంచుతున్నది. బుర్రా సాయిమాధవ్ అందిస్తున్న కథ, కథనాలు, మాటలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయనే సినీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది.

    English summary
    The NTR biopic is the next big thing Tollywood is excited about. The film, directed by Krish Jagarlamudi, has Balakrishna and Vidya Balan in the lead roles. Before the film could go on floors, the NTR biopic underwent a lot of changes. According to the latest report, the film is being made on a staggering budget of Rs 50 crore. If the reports are believed to be true, NTR biopic is the most expensive movie in Balayya's career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X