ఎన్టీఆర్ బయోపిక్: మహేష్ బాబు పాత్రకు సంబంధించిన వివరాలు లీక్!

By Bojja Kumar

Recommended Video

Ntr Biopic : Mahesh Babu Play Superstar Krishna Role

మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప చిత్రంగా తీర్చి దిద్దాలనే ఆలోచనలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు తేజ చేతికి అప్పగించిన ఆయన దీనికోసం భారీ తారాగణం ఎంపిక చేస్తున్నారు. మనం ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో చూడని భారీ తారాగణాన్ని ఇందులో చూడబోతున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఇంకా చాలా మంది స్టార్స్ ఇందులో భాగం కాబోతున్నారు.

 మహేష్ బాబు పాత్ర ఇదేనా?

మహేష్ బాబు పాత్ర ఇదేనా?

ఎన్టీఆర్ బయోపిక్‌లో మహేష్ బాబు కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలిసినప్పటి నుండి ఆయన ఇందులో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆయన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నారట.

ఇతర పాత్రల్లో ప్రముఖులు

ఇతర పాత్రల్లో ప్రముఖులు

అంతే కాకుండా బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఆమె శ్రీదేవి పాత్రలో మెరవబోతోందట. జయలలిత పాత్రలో హీరోయిన్ కాజల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

నందమూరి ఫ్యామిలీ హీరోలు కూడా

నందమూరి ఫ్యామిలీ హీరోలు కూడా

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇతర నందమూరి ఫ్యామిలీ నటులైన కళ్యాణ్ రామ్, తారక రత్నతదితరులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారట. నారా రోహిత్‌ను కూడా ఓ ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం.

చంద్రబాబు పాత్రలో రాజశేఖర్?

చంద్రబాబు పాత్రలో రాజశేఖర్?

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడి పాత్రలో ప్రముక నటుడు రాజశేఖర్ కనిపించబోతున్నారట. ఇలా చాలా మంది స్టార్లు ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో అఫీషియల్ ప్రకటన

త్వరలో అఫీషియల్ ప్రకటన

సినిమాలోని పాత్రలకు సంబంధించి చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. వారే స్వయంగా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తారని టాక్. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం అని తేజ తెలిపారు.

బాలయ్యే నిర్మాత

బాలయ్యే నిర్మాత

తన తండ్రి జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎలాంటి లోటు లేకుండా తెరకెక్కించాలని బాలయ్య డిసైడ్ అయ్యారు. అందుకే ఈ చిత్రం నిర్మాణంలో తానూ భాగం అయ్యారు. ప్రేక్షకుల ఊహకు అందని స్థాయిలో భారీగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X