హాట్ న్యూస్ : ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్ ఛేంజ్
ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం రిలీజ్ డేట్ మారనుందంటూ గత కొద్ది రోజులుగా వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ డేట్ ని అక్టోబర్ 14కి వాయిదా వేస్తారని అనుకున్నారంతా. అయితే తాజా పరిణామాల దృష్ట్యా అక్టోబర్ 9న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజు..ధియోటర్ ఓనర్స్ కు ఫోన్ చేసి అక్టోబర్ తొమ్మిదవ తేదీకి ప్రిపేరవమని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక డేట్ ఛేంజ్ కావటానికి మెయిన్ రీజన్...మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజానే. ఈ చిత్రం అక్టోబర్ ఏడున రిలీజవుతోంది. రెండు రోజుల గ్యాప్ తో బృందావనం రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పై పెద్ద ఎఫెక్టు ఉండదని బావిస్తున్నారు. ఇక కాజల్, సమంత హీరోయిన్స్ గా చేసిన బృందావనం చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు. వంశీ ఇంతకుముందు...ప్రభాస్ హీరోగా మున్నా చిత్రాన్ని డైరక్ట్ చేసారు. అలాగే అదుర్స్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











