చిరు, చరణ్ దూరం... మెగా హీరో కోసం రంగంలోకి యంగ్ టైగర్!

Recommended Video

Jr NTR Grace The Pre Release Event Of Sai Dharam Tej's Chitralahari | Filmibeat Telugu

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈవేడుకకు గెస్టుగా ఎవరు వస్తారనే విషయం హాట్ టాపిక్ అయింది.

ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్నారా?

ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్నారా?

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంటుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ‘జనతాగ్యారేజ్' తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారితో యంగ్ టైగర్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే యంగ్ టైగర్‌ను ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం.

చిరంజీవి, చరణ్ అందుకే దూరం...

చిరంజీవి, చరణ్ అందుకే దూరం...

వాస్తవానికి ‘చిత్రలహరి' చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్ చీప్ గెస్టులుగా హాజరు కావాల్సి ఉంది. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరు మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. ‘చిత్రలహరి' వేడుకకు దూరంగా ఉండటానికి కూడా కారణం ఇదే అని తెలుస్తోంది.

రాజకీయాలకు దూరంగా మెగా హీరోలు

రాజకీయాలకు దూరంగా మెగా హీరోలు

మార్పే లక్ష్యంగా ‘జనసేన' పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ పిలుపు మేరకు ఇటీవలే నాగబాబు పార్టీలో చేరి నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే చిరంజీవితో పాటు మిగతా మెగా హీరోలంతా కూడా ‘జనసేన'కు దూరంగానే ఉంటున్నారు. ఇది ఫ్యామిలీ పార్టీ అనే మచ్చ రాకూడదనే పవన్ కళ్యాణ్ వారిని దూరంగా ఉంచుతున్నారట.

చిత్ర లహరి

చిత్ర లహరి

కిషోర్ తిరుమల సినిమా అంటే వినోదాత్మకంగా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌ ప్రెజంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X