ఎన్టీఆర్ పాట పాడటమే కాదు...ఇంకా
హైదరాబాద్ : 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'రభస'. రెండో సినిమాకే ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకిరానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడారు అన్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో హ్యాపీ న్యూస్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ..ఇంట్రడక్షన్ సాంగ్ కు కొరియోగ్రఫీ కూడా చేసారని విశ్వసనీయ సమాచారం. ఫస్ట్ లుక్ తో ఆకట్టులేకపోవటంతో ఈ ఇంట్రడక్షన్ సాంగ్ నే టీజర్ గా కట్ చేసి వదులుదామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ... ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. ఎన్టీఆర్, సమంతలపై స్విట్జర్లాండ్ ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 20కి సినిమా మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 27న పాటల్ని విడుదల చేసి, ఆగస్ట్ 14న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 20 మందితో కన్నా ఎన్టీఆర్‌తోనే కంఫర్ట్‌గా ఉంది.

కమర్షియల్ సినిమాకి ప్రేక్షకుల మెచ్చే అన్ని అంశాలు కావాలి. ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాలో 20మందికి పైగా ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లున్నారు. వారందరిని ఒక ప్రేమ్‌లో చూపించే కంటే... ఎన్టీఆర్‌తో షాట్ తీయడానికి నాకు చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఎన్టీఆర్‌లో ఉన్న ఎనర్జీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అన్నారు.
ఇక రభస ఫుల్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో చక్కని సెంటిమెంట్ కూడా ఉంది. ఎన్టీఆర్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో కనిపిస్తారు. ప్రతి తల్లి ఇలాంటి కొడుకు, అలాగే ప్రతి కుటుంబం ఇలాంటి ఓ కుర్రాడు ఉండాలనుకునేలా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది. అతని పాత్రకు మంచి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎన్టీఆర్‌లో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా, సెకెండాఫ్ ఫ్యామిలీ వాల్యూస్‌తో ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం ధైర్యంగా వచ్చి చూసేలా నా సినిమా ఉంటుంది అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











