జూ ఎన్టీఆర్ కమిటయిన రెండు కొత్త చిత్రాలు...
జూ ఎన్టీఆర్ తాజాగా మరో రెండు చిత్రాలును ఓకే చేసి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. వాటిలో సింహాతో బాలకృష్ణకు హిట్టిచ్చిన బోయపాటి శ్రీనివాస్ దర్శకుడుగా ఓ చిత్రం, శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో చిత్రం. ఒకటి ఫక్తు యాక్షన్ ఫిల్మ్ కాగా, మరొకటి రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలు వచ్చే సంవత్సరమే షూటింగ్ జరుపుకుంటాయి. శక్తి చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యాక ఈ చిత్రాలు మొదలవుతాయి. అలాగే బృందావనం చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బృందావనం,శక్తి చిత్రాలు రెండింటిలో కంటిన్యూగా షెడ్యూల్స్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఇదే పద్దతిని భవిష్యత్ లో కూడా పాటించనున్నారు. అలా చేస్తే గ్యాప్ రాదని భావిస్తున్నారు. అలాగే ఒకే జెనర్ కంటిన్యు కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకునే దిసగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవంబర్,డిసెంబర్ నెలలు వివాహం నిర్ణయించటంతో షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తున్నారు. అప్పటివరకూ బిజీ బిజీగా గ్యాప్ లేకుండా చేస్తూనే ఉంటారు. మహేష్ తో చిత్రం పూర్తవగానే శ్రీను వైట్ల..ఎన్టీఆర్ చిత్రం పై కసరత్తు ప్రారంభిస్తారు.


Click it and Unblock the Notifications











