ఎన్టీఆర్ అప్ సెట్..అందుకే ప్రెస్ నోట్

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరో గా పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న పేరుపెట్టని చిత్రం షూటింగ్‌ రెండో షెడ్యూల్‌ ఈ నెల 10 నుంచి జరగనుందనంటూ మీడియాకు ప్రెస్ నోట్ వచ్చింది. హఠాత్తుగా ఇలా ప్రెస్ నోట్ జరగటం వెనక కారణం కేవలం రూమర్స్ ఖండించటమే అని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆగిపోయిందనే వార్తలు మీడియాలో చక్కర్లు చేస్తున్నాయి. వీటికి వెంటనే చెక్ పెట్టకపోతే దాని ఇంపాక్ట్ ప్రాజెక్టుపై నెగిటివ్ గా పడే అవకాసం ఉందని గమనించిన ఎన్టీఆర్ వెంటనే నిర్మాత బండ్ల గణేష్ ని సినిమా ఉందని ఖండన లాంటి ప్రెస్ నోట్ పంపమన్నాడని చెప్పుకుంటున్నారు. ఆ ప్రెస్ నోట్ లో ఉన్న మ్యాటరే ఈ రోజు మీడియాలో అంతటా వచ్చింది.

నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ రెండో షెడ్యూల్‌తో సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్‌, వైజాగ్‌తో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో ఎన్టీఆర్‌ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా మ్యూజికల్‌ హిట్టవుతుంది. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కెరీర్‌లలోనూ, మా బేనర్‌లోనూ ఇది ప్రతిష్ఠాత్మక చిత్రంగా తయారవుతోంది'' అని చెప్పారు.

NTR condemns RUMOURS with Press Note

ఎన్టీఆర్‌ హీరోగా పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. కాజల్‌ హీరోయిన్ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.

ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్‌, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్‌ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X