ఎన్టీఆర్ మీద 50 కోట్లు పెట్టబోతున్నారు

By Srikanya

హైదరాబాద్: గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ కి బిజినెస్ పరంగా మాత్రం క్రేజ్ తగ్గటం లేదు. ఇది గమనించిన కార్పోరేట్ కంపెనీలు ఆయనతో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్ గా 50 కోట్లు డీల్ కుదుర్చుకున్నారని సమాచారం. అత్తారింటికి దారేది చిత్రంతో ఘన విజయం సాధించిన రిలియన్స్ సంస్ధ తెలుగులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఈ డీల్ అని తెలుస్తోంది. నిర్మాతగా బి.వి.యస్ ఎన్ ప్రసాద్ ఉండే అవకాసం ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ సురేంద్రరెడ్డి కాని అయ్యే అవకాసం ఉందని వినపడుతోంది.

ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే.... సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కలయికలో ఈ 'రభస' చిత్రం రూపుదిద్దుకొంటోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. రాజధానిలో చిత్రీకరణ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో నడిచే కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాణగం పాల్గొంటున్నారు. మరో పది రోజుల పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరపనున్నారు. ఈ సీన్స్ సినిమాలో హెలెట్ అవుతాయంటున్నారు.

బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

NTR corporate 50 crore deal

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

అలాగే ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X