'దమ్ము' కోసం ఎన్టీఆర్ మరోసారి లైపో

By Srikanya

ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లిలో కాస్త ఒళ్లు చేసి కనిపించిన సంగతి తెలిసిందే. అందులోనూ ఆ మ్యాటర్ మీడియాలోనూ హైలెట్ అయ్యింది. టీవీ ఛానెల్స్ వారు సైతం ఇదే ప్రశ్నను అడిగారు అయితే ఎన్టీఆర్ అదేం లేదని దమ్ము చిత్రంలో అందరూ కోరుకున్నట్లే సన్నబడి కనపడతానని హామీ ఇచ్చారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. తనకు పెళ్లి అవటం వల్లనే లావు అయ్యానని, అది తన వివాహ జీవితం విజయవంతగా జరగిందనటానకి గుర్తు అన్నారు.

అయితే భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. రాఖీ చిత్రం సమయంలో ఉన్నంత లావు మాత్రం కానని నవ్వుతూ అన్నారు. ఇక ఈ చిత్రంలో కరెంట్ తీగ కూడా నా లాగ సన్నగ ఉంటుంది, దానమ్మ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్న డైలాగు చెప్తారు.ఈ డైలాగు రాసే సమయానికి సన్నగా ఉన్నా,చెప్పే సమయానికి లావు అవటంతో సినిమాలో ఈ డైలాగు,శరీరం సింక్ కాకూండా పోయింది. దాంతో అందరి కోరిక మేరకు ఆయన మరోసారి లైపో చేయించుకోబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక గతంలోనూ 'రాఖీ"లో దారుణంగా కనిపించిన వాడల్లా, లైపో చేయించుకుని 'యమదొంగ"లో స్లిమ్ గా కనిపించాడు. 'కంత్రి"కి ఇంకా కొవ్వు కరిగించేసుకుని అల్ట్రా స్లిమ్ అయ్యాడు.ఇప్పుడు అదే పద్దతిలో మరోసారి కరెంట్ వైర్ లా మారనున్నాడని చెప్తున్నారు.ఏది చేసినా అబిమానుల కోసమే అనేది నిజం. అతను లావుగా ఉన్నా డాన్స్ లు ఇరగతీస్తాడనేది మరో నిజం.దమ్ము చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్ట్ చేస్తున్నాడు. కెఎస్ రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విందు భోజనంలా మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్తున్నాడు ఎన్టీఆర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X