బాగా బలుపు ఉన్నోడంటూ ఎన్టీఆర్...
"బాగా భయపడేవాడు ధైర్యం కోసం ఎదురుచూస్తాడు...బాగా బలుపు ఉన్నోడు వాడ్ని టచ్ చేసే మగాడు కోసం చూస్తాడు..నేను రెండో టైప్" అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సినిమాలో హైలెట్ అవుతుందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము. సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో డైలాగు అంటూ ఇది ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ..చెప్పే ఈ డైలాగుకి ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.ఇక ఈమధ్యన కొత్తగా విడుదలయ్యే చిత్రాలలోని డైలాగులు ముందుగానే క్రేజ్ కోసం లీక్ చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా కొన్ని డైలాగులు తామే క్రియేట్ చేసి మరీ నెట్ లో పెడుతున్నారు. దాంతో ఏ డైలాగు ఉంటుందో..ఏది ఉండదో తెలియని స్ధితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది.
ఇక దమ్ము చిత్రం ఆడియో ఉగాది రోజున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ఆడియో పంక్షన్ ని విభిన్నంగా చేయాలని నిర్మాత అలగ్జాండర్ వల్లభ ప్లాన్ చేస్తున్నారు. మల్టి సిటీ ఆడియో ఫంక్షన్ గా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. అంటే మూడు సిటీల్లో ఒకే సారి అభిమానుల మధ్య ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. దాంతో ఆ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు. అంతేగాక ఆడియోకు అదనపు పబ్లిసిటీ వస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి సినిమాకు పాటలు హైలెట్ గా నిలిచేలా ప్రత్యేకంగా ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. . హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా... పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. బోయపాటి శ్రీను దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











