Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ 'దమ్ము' రషెష్ చూసి షాక్
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు, ఎన్టీఆర్, యూనిట్ లోని కొంతమంది కీలకమైన వారు ఈ రషెష్ ని చూడటం జరిగింది. ఈ రషెష్ ని చూసిన వారు షాక్ అయ్యారట. యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించాడని, ఇప్పటివారకూ ఎన్టీఆర్ ఇలాంటి సీన్స్ చేయలేదని ముక్త కంఠంతో చెప్పటంతో నిర్మాత కెఎస్ రామారావు చాలా హ్యాపీ ఫీలయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. రామ్-లక్ష్మణ్ లు రూపొందించిన ఫైట్స్ అందరినీ అలరిస్తాయని, ముఖ్యంగా మాస్ చేత విజిల్స్ వేయించేలా బోయపాటి శ్రీను డిజైన్ చేసాడని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పవర్ ఫుల్ పాత్రలు చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే సెకెండాఫ్ లో ఎన్టీఆర్ చెప్పే లెంగ్తీ డైలాగులు హాట్ టాపిక్ గా మారతాయని, అవి ఇండస్ట్రీలో రికార్డుగా మిగులుతాయని చెప్పుకుంటున్నారు.
సింహాద్రి నాటి మ్యాజిక్ ఈ చిత్రంతో మళ్లీ దమ్ముతో రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. బోయపాటి శ్రీను సైతం సింహా లాంటి సూపర్ హిట్ ని మరో సారి ఇవ్వబోతున్నాననే కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఫస్టాఫ్ లో కామిడీతో నడిచినా సెకెండాఫ్ మాత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2012 వేసవిలో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కార్తీక,త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. అలాగే 'పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్ లోని యాక్షన్ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి.