NTR Devara Release Date:దేవర వచ్చేస్తున్నాడు.. అందరూ సైడ్ ఇచ్చేశారుగా!
ప్రస్తుతానికి కొన్ని ఆసక్తికరమైన కాంబినేషన్లు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే ఆ సినిమాలన్నీ ఈ ఏడాది రిలీజ్ అవ్వడం కష్టమే వచ్చే ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాల రిలీజ్ డేట్లు ఇప్పటినుంచి లాక్ చేసుకునే పరిస్థితుల్లో పడ్డారు దర్శకనిర్మాతలు ఈ క్రమంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన రిలీజ్ డేట్ వార్త టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే
అంచనాలు రెట్టింపు...: రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. వాస్తవానికి ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడి కొరటాల శివ సినిమా ముందుకు వచ్చింది. ముందు నుంచి ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టు సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేయడం మొదటి సినిమా నుంచి లీకవుతున్న ఫోటోలు కొన్ని లుక్స్ సినిమా మీద అంతకంతకూ అంచనాలు పెంచేస్తోంది.

సమ్మర్లో దేవర...: ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉన్న సినిమాల రిలీజ్ డేట్ ఇదే అంటూ గతంలో కొన్ని ప్రచారాలు తెరమీదకి వచ్చాయి. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు .కాబట్టి ఆ ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. సినిమాలకు సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ బెస్ట్. అయితే ఈ సమ్మర్ సీజన్ లో అందరికీ సెలవులతో పాటు కాలేజీ కుర్రాళ్లకు కూడా సెలవులు దొరకడంతో ఎక్కువగా సినిమాలను అప్పుడు కూడా రిలీజ్ చేసేందుకు దర్శకని నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు.

ఆ సెంటిెమెంట్ తో భయం...: ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల మీద కొసరాజు హరికృష్ణ సుధాకర్ నిర్మిస్తున్నారు. రాజమౌళితో ఏ సినిమా చేసిన ఆ తర్వాత హీరోలు చేసే సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తాయని సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో దేవర విషయంలో కొరటాల శివ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు.

తప్పుకున్న హీరోలు...: ఇక మహేష్ బాబు చిరంజీవి సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ సినిమాని డిసెంబర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా సమ్మర్ రేసు నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో దేవర సినిమాకి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ముందు ప్రకటించిన భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల నేపథ్యంలో దాన్ని దసరాకి వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











