హలీం పడగానే ఒక్కటైన దిల్ రాజు, ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్, దిల్ రాజు కాంబినేషన్‌లో ఇటీవల వచ్చి సూపర్ హిట్టయిన సినిమా 'బృందావనం". వంశీ పైడి పల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్, సమంతలు లీడర్ రోల్స్ చేశారు. అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక పోస్టు ప్రొడక్షన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, దిల్ రాజు మధ్య చిన్న పాటి విబేధాలు వచ్చాయి. ఓ విషయంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. అప్పటినుంచి ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉంటూ వచ్చారు. ఆ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంది గానీ, సినిమా కార్య్రకమాల్లో ఇద్దరూ కలిసి కనిపించింది గానీ లేదు. ఈ నేపథ్యంలో ఊసరవెల్లి సినిమా ఆడియో వేడుకలో దిల్ రాజు ఉత్సాహంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని మాయం చేయడానికి ఇద్దరికీ సన్నిహితంగా మెలిగే కొందరు సీనీ ప్రముఖులు ఇటీవల ముగిసన రంజాన్ మాసంలో ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు జూనియర్, దిల్ రాజు ఇద్దరూ కలిసి ఒకే కార్లో ఏకాంతంగా బయటకు బయల్దేరారు. మార్గ మధ్యంలో హలీం కనిపించడంతో కార్లో కూర్చొని తింటూ తమ మధ్య వచ్చిన క్లాషెస్ గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఇలా హలీం పూర్తయ్యేలోగా ఇద్దరూ ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చి...మళ్లీ ప్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో మాదిరి సినిమా రంగంలో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రలు ఉండరు అంటూ చర్చించుకుంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.


Click it and Unblock the Notifications











