డ్రాగన్ లో ఎన్టీఆర్ విధ్వంసం.. ఆ ఒక్క సీన్ థియేటర్లను షేక్ చేస్తుందట!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా'డ్రాగన్'. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో తెరకెక్కించబోయే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి పలు రూమర్స్ వస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇంతకీ ఈ సంగతేంటీ?

కెజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాంటి డైరెక్టర్.. ఎన్టీఆర్‌ను తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ అవతారంలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమాను అంతర్జాతీయ ఓపియం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నారట. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ 'లూగర్' అనే పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చూడని రౌద్రరూపంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట.ఈ పాత్ర ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

NTR Dragon Update Massive Sri Lanka Action Sequence Set to Shake Theatres Worldwide

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ప్రశాంత్ నీల్ స్టైల్ డార్క్ విజువల్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ ఎలివేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేవలం కొన్ని సెకన్ల వీడియోతోనే సినిమా స్థాయి ఏంటో మేకర్స్ చూపించారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు డ్రాగన్‌పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. శ్రీలంకలో ఓ గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారట. అడవులు, కొండ ప్రాంతాలు, సముద్రతీర లొకేషన్లలో హాలీవుడ్ స్థాయి ఫైట్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని, సినిమా విడుదలైన తర్వాత అందరూ ఈ ఒక్క సీన్ గురించే మాట్లాడుకునేలా డిజైన్ చేస్తున్నారని, ఆ సీన్ తో థియేటర్లను షేక్ చేయబోతున్నదని మూవీ లవర్స్ భావిస్తున్నారు.

ఈ షెడ్యూల్‌లోనే హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సాంగ్‌ను కూడా షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్-రుక్మిణి జోడీ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రేమ, యాక్షన్, ఎమోషన్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ నటుడు బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు కథలో కీలక మలుపులు తీసుకురానున్నాయని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కెజీఎఫ్, సలార్ సినిమాల్లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు 'డ్రాగన్' కోసం కూడా పవర్‌ఫుల్ స్కోర్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో రవి బస్రూర్ సంగీతం సినిమాకు మరింత అట్రాక్షన్ గా నిలవనుందట. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. విజువల్ క్వాలిటీ, యాక్షన్ బ్లాక్స్, సాంకేతిక ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more about: prashanth neel jr ntr dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X