twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ :సుకుమార్ కి ఎన్టీఆర్ షాక్

    By Srikanya
    |

    హైదరాబాద్: సుకుమార్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఊహించని విధంగా సుకుమార్ కి ఎన్టీఆర్ నో చెప్పారని సమాచారం. ఆ స్లాట్ లోకి సురేంద్ర రెడ్డి వచ్చారని తెలుస్తోంది. రేసు గుర్రం ఫినిష్ చేయగానే సురేంద్ర రెడ్డి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. 1 నేనొక్కిడనే రిజల్ట్ తో ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే అఫీషియల్ గా ఈ వార్త పై ఇరు వైపుల నుంచి స్పందన లేదు. ఏప్రియల్ నుంచి ఈ చిత్రం స్టార్టవుతుందని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం 'రభస ' (వర్కింగ్ టైటిల్) ఇటీవల హైదరాబాద్‌, జైపూర్‌, పొల్లాచ్చి లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. హైదరాబాద్ లో మరో దఫా షెడ్యూల్‌ మొదలుపెడతారు. ఎన్టీఆర్‌, సమంతల జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 'బృందావనం', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాల్లో అలరించిన ఈ ఇద్దరూ మూడోసారి జతకట్టారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకుడు. బెల్లకొండ సురేష్‌ నిర్మాత. ప్రణీత మరో హీరోయిన్.

    NTR drops off Sukumar's movie!

    నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించే చిత్రమిది. ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    Not long ago did producer BVSN Prasad announce that he would be producing a film with NTR under Sukumar's direction. NTR also had given dates for this film from April. But NTR might not do this film after all.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X