రాజమౌళిపై గుర్రుగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఫైర్ అవుతూ కామెంట్స్!
Recommended Video
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన.. మరోసారి అలాంటి మ్యాజిక్ సృష్టించేందుకు RRR అంటూ రెడీ అవుతున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ లోగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై గుర్రుగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

RRR.. ఆశ్చర్యపర్చిన జక్కన్న
బాహుబలి తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం ఏంటన్నది యావత్ భారతదేశం ఎదురు చూడసాగింది. ఏ బాలీవుడ్ హీరోతో సినిమా చేస్తాడో అని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ వాటన్నంటికి కొట్టిపారేస్తూ.. అతి పెద్ద మల్టీస్టారర్‌కు నాంది పలికారు జక్కన్న. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో RRR సినిమా చేస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

RRR ట్రెండింగ్
రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అంటూ ముగ్గురి పేర్లు R అనే అక్షరంతో మొదలవుతుండగా.. RRR అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టి సినిమాను ప్రారంభించేశారు. అయితే ఈ టైటిల్ జనాలను బాగా ఆకర్షించడంతో అదే ఉంచాలని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్.

టైటిల్ అదేనంటూ రూమర్
RRR అనే దానికి పూర్తి స్వరూపం చెప్పి.. వాటికి సరిపోయే ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను సూచించమని అభిమానులను కోరారు జక్కన్న. దీంతో ఎంతో మంది తమ సమాధానాలను, టైటిల్స్‌ను యూనిట్‌కు పంపించారు. వాటన్నింటి లోంచి 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

గురువుగా అజయ్ దేవగణ్.. సీతగా అలియా భట్..
ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందించనున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ గురువు పాత్రలో నటించనున్నట్లు టాక్. వీరిద్దరికి మార్గాన్ని చూపి, విద్య నేర్పే గురువు పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తోంది.

కొమురం భీం జయంతి సందర్బంగా
RRR లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి లుక్స్ ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ లోగా ఇటీవలే కొమురం భీం జయంతి రావడంతో, ఈ సందర్బంగా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేస్తారని భావించారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదు.

సరిపెట్టుకున్న జక్కన్న.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
కొమురం భీం జయంతి సందర్బంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసిన RRR టీం.. RRRలో యంగ్ భీంగా ఎన్టీఆర్‌ని చూపించేందుకు ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా ఇంతటితోనే సరిపెట్టుకున్నారు. దీంతో ఎన్టీఆర్ లుక్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆయన ఫ్యాన్స్ రాజమౌళి తీరుపై మండిపడుతుండటం హాట్ ఇష్యూగా మారింది.


Click it and Unblock the Notifications











