ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు
హైదరాబాద్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన తాజా చిత్రం రభసపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కందిరీగ వంటి హిట్ చిత్రం తీసిన దర్శకుడుతో తీసిన చిత్రం కావటంతో అంచనాలు పెరిగాయి. అయితే ఊహించని విధంగా చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. చాలా దారుణమైన కలెక్షన్స్ సంపాదించుకుంది. దాంతో దీనికి కారణం చిత్రాన్ని సరిగ్గా ప్రమోట్ చేయకపోవటమేనని అభిమానులు అంటున్నారు.
బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్ చిత్రం అల్లుడు శ్రీను పై పెట్టిన శ్రద్ద ఎన్టీఆర్ రభసపై పెట్టలేదని డైరక్ట్ గానే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. బెల్లంకొండ...తెలివిగా ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ తో రభస ని మంచి రేటుకు అమ్మాడు కానీ ఆ రేంజిలో ప్రమోషన్ మీద ఖర్చు పెట్టలేదని అంటున్నారు. రిలీజైన మరుసటి రోజు నుంచి ప్రమోషన్స్ తగ్గిపోయాయని చెప్తున్నారు.

ఈ రోజున సినిమా టాక్ కు సంభంధం లేకుండా నిర్మాతలు ఖర్చు పెట్టి ప్రమోట్ చేయటంతో సినిమాని నిలబెడుతున్నారని, ఆ విషయం తెలిసినా బెల్లంకొండ పట్టించుకోలేదని చెప్తున్నారు. ఫైనాన్స్ లు తెచ్చి చేసిన బెల్లంకొండ సేఫ్ అని, ఎన్టీఆర్ కెరిర్ కే ఈ చిత్రం నష్టం తెచ్చిందని అంటున్నారు. హీరోలును చూపించి ఫైనాస్స్ లు తెచ్చి సినిమా చేస్తున్న నిర్మాతలు అదే హీరోపై ఎందుకు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్దం కావటం లేదని, ఎన్టీఆర్ ఇలాంటి నిర్మాతలను దూరం పెట్టాలని సూచిస్తున్నారు.
అయితే ఇదంతా తమ అభిమాన హీరో సినిమా ఫ్లాపు అయిందనే ఆవేదన కోణంలోంచి మాత్రమే చూడాలి. ఎంతకు అమ్మారు...లాభం వచ్చిందా..నష్టం వచ్చిందా అన్నది బయిటకు ఎవరికీ మాత్రం తెలియదు.బెల్లంకొండ సైతం ఈ సినిమాతో నష్టపోయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఆత్మహత్యకు సైతం ప్రయత్నించాడంటూ న్యూస్ లు, ఖండనలు వచ్చాయి.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











