»   » పవన్ తో లేటయ్యేటట్లు ఉంది..ఈ లోగా ఎన్టీఆర్ తో... ?

పవన్ తో లేటయ్యేటట్లు ఉంది..ఈ లోగా ఎన్టీఆర్ తో... ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ కు చాలాకాలం నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలనే కోరిక ఉందని చెప్తారు. అయితే త్రివిక్రమ్ వరసగా మెగా హీరోలు లేదా మహేష్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ తో అనుకున్న ప్రాజెక్టు లేటయ్యేటట్లు ఉండటంతో ఎన్టీఆర్ తో చేయటానికి ముందుకు వఎఁచ్చాడని సమచారం. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత...ఎన్టీఆర్ ఎట్టి పరిస్దితుల్లోనూ త్రివిక్రమ్ తో చేయాలనుకున్నారని, అదీ మెటీరియలైజ్ కాలేదని చెప్తారు. త్రివిక్రమ్ ఓకే అనటంతో ఎన్టీఆర్ సంతోషంగా ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ...,సుకుమార్ తో చిత్రం చేస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం అయ్యింది.

ఈ విషయమై నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్ కి మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్నిఇచ్చారు అని తెలిపారు.

NTR green signal to Trivikram?

సాహసం, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ తో కలిసి చేస్తున్న మరో భారీ చిత్రమిది అని బివిఎస్ఎన్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
NTR gave green signal to Trivikram project. Currently NTR is starring under Sukumar direction and the film will go to sets after he completes this one.
Please Wait while comments are loading...