ఎన్టీఆర్ రాత్రింబవళ్లూ అదే పనిలో...
శక్తి, ఊసరవెల్లి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఊహించన ఫలితాన్ని ఇవ్వకపోవటంతో నిరాశ చెందిన జూ.ఎన్టీఆర్ ఇప్పుడు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆయన దమ్ము చిత్రం గురించి డిస్కషన్స్, షూటింగ్,స్క్రిప్టులో మార్చులు, గెటప్ లో జాగ్రత్తలు వంటివి చర్చిస్తూ నిమగ్నమై ఉన్నారు. ఆయన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి తన పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. త్రిష, కార్తిక హీరోయిన్స్ గా సెట్ కావటంతో ఇక అడ్డంకులేమీ లేకుండా స్మూత్ గా షూటింగ్ జరిగేందకు నిర్మాతకు సహకరిస్తూ బోయపాటి శ్రీనుతో ఓ రేంజి అవుట్ పుట్ తీసుకుంటున్నాడని వినపడుతోంది. ఇక దమ్ము చిత్రం 2012 వేసవిలో ఓ బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.
అలాగే ఈ చిత్రం కథలో ఆ రేంజి పొటిన్షియల్ ఉందని, సింహా.. బాలకృష్ణకి ఎలాగో తనకు దమ్ము అలాగే తన కెరీర్ కి ఊతమిస్తుందని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాని పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో బోయపాటి ఉన్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ పై సుమారు సంవత్సరం పాటు బోయపాటి కృషి చేశారని చెప్తున్నారు. ఎన్టీఆర్ తల్లిగా ఈ సినిమాలో భానుప్రియ బావ క్యారక్టర్ కు హీరో వేణును ఎంపిక చేసారు. ఇక తాత క్యారక్టర్ కు కోట శ్రీనివాసరావు కన్ ఫార్మ్ అయ్యారని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











