పవన్ కళ్యాణ్ ని మెచ్చుకున్న ఎన్టీఆర్

By Srikanya

పవన్ కళ్యాణ్ ని రియల్ పవర్ స్టార్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నారనే వార్త ఇప్పుడు నెట్ లో హాట్ గా మారింది. రూమరో నిజమో తెలియని ఈ వార్త వివరాల్లోకి వెళ్ళితే..దమ్ము షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ పిబ్రవరి 15 నుంచిపొల్లాచ్చి వెళ్లాలి. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసారు. అయితే అక్కడ వీళ్లనుకున్న లొకేషన్ లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ షూటింగ్ కి ఫిక్స్ అయ్యిపోయింది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ కోసం అక్కడ పిబ్రవరి 5 నుంచి పిబ్రవరి 16 వరకూ లొకేషన్ బుక్కైపోవటంతో దమ్ము నిర్మాతలు తల పట్టుకున్నారు. అప్పటికీ గబ్బర్ సింగ్ నిర్మాతలను రిక్వెస్ట్ చేసారు. ఆ పైట్ సీక్వెన్స్ వాయిదా వేస్తే ఇప్పటికే ఆలస్యమైన దమ్ము చిత్రం మరింత ఆలస్యమవుతుంది.

ఈ నేపధ్యంలో రకరకాలుగా అడిగినా తమ గబ్బర్ సింగ్ షెడ్యూల్ కి ఇబ్బంది ఎదురవుతుందని వారు కాదన్నారు. దాంతో దమ్ము యూనిట్ ఏం చేయాలో అర్దం కాక విరమించుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఫోన్ చేసి పర్శనల్ గా పవన్ కళ్యాణ్ కి రిక్వెస్ట్ చేసారట. వెంటనే పవన్ కాదనుకుండా ఓకే చేసి తన యూనిట్ ని కన్వీన్స్ చేసుకుని ఆ లొకేషన్ ని దమ్ము యూనిట్ కి అప్పచెప్తామని చెప్పారు. దాంతో ఆనందపడ్డ ఎన్టీఆర్ అందుకే పవన్ కళ్యాణ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని,అతను రియల్ పవర్ స్టార్ అని మెచ్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. దీంట్లో నిజానిజాలు ఎలా ఉన్నా ఇద్దరు కో స్టార్స్ తమ మధ్య పోటీని మరిచి స్నేహపూరిత వాతావరణంలో మాట్లాడుకుని ఒకరినొకరు ప్రశంసించుకోవటం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం అంటున్నారు. ఎన్టీఆర్ కూడా మొదటినుంచి తర,తమ భేధం లేకుండా ఇండస్ట్రీలో అందరినీ కలుపుకుపోతాడనే విషయం మరోసారి రుజువైంది అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X