యాక్సిడెంట్ కు షాక్ అయిన జూ.ఎన్టీఆర్
హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు పరిసరాల్లోని పుప్పాల్ గూడలో బైక్ రేసింగ్ లో జరిగిన అయాజుద్దీన్ యాక్సిడెంట్ ..ఇప్పుడు జూ.ఎన్టీఆర్ లో టెన్షన్ ని క్రియేట్ చేసిందని తెలుస్తోంది. అయూజ్ లాగానే ఎన్టీఆర్ కి కూడా బైక్ రేసింగ్ అంటే ప్రాణం. ఇండియాలో సూపర్ బైక్ హార్డ్లీ డేవిడ్ సన్ ని కొన్న మొదటి కష్టమర్ కూడా ఎన్టీఆరే. కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ దాన్ని దాదాపు పందొనిమిది లక్షలకు తీసుకున్నారు. అయాజుద్దీన్ లాగే ఎన్టీఆర్ కి రెగ్యులర్ గా అవుటర్ రింగ్ రోడ్ లో ఎర్లీ అవర్స్ లో బైక్ రైడింగ్ చేయటం హాబీ. ఆ టైమ్ లో అయితే ఎవరూ గుర్తు పట్టరని ఎన్టీఆర్ వెల్తూంటారు. హెల్మెట్ పెట్టుకుని ఖాళీగా ఉన్న రోడ్డులపై ఎన్టీఆర్ సరదాగా ట్రిప్స్ వేస్తూంటారు. ఇది ఎన్టీఆర్ సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇక అయాజుద్దీన్ యాక్సిడెంట్ విషయం తెలిసిన ఎన్టీఆర్ కొద్ది సేపు షాక్ కు గురి అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. కొద్ది నెలలు వరకూ ఎన్టీఆర్ బైక్ రేసింగ్ కు దూరంగా ఉంటారని చెప్పుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ తోవి పాటు నాగచైతన్య, అల్లు అర్జున్, అనూష్క, ముమైత్ ఖాన్ కూడ ఈ బైక్ లను బుక్ చేసుకున్న వారిలో ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











