NTR: లాంగ్ వెకేషన్ కు ఎన్టీఆర్.. జకన్న నుంచి గ్రీన్ సిగ్నల్ తో ఎక్కడికి వెళ్తున్నారంటే?
చాలా కాలం నుంచి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం కష్టపడుతున్న ఎన్టీఆర్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత వెకేషన్ కి వెళ్దాం అనుకుంటున్నా సరే ఎవరు మీరు కోటీశ్వరులు కారణంగా ఆయన బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు అది కూడా పూర్తి కావడంతో ఆయన లాంగ్ వెకేషన్ కు వెళ్లిపోతున్నారని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.

కొద్ది రోజుల క్రితమే
అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి అనుకున్నా సరే కారణంగా సినిమా వాయిదా పడుతూ వెళ్ళింది. చివరికి చాలా లేటుగా ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది.

తరచూ
అయితే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుని కాస్త వెకేషన్ కి వెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు వెకేషన్ కి వెళ్లాల్సిన సమయం దగ్గర పడింది. మామూలుగా అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయిన వెంటనే ఆయన వెకేషన్ కు వెళ్లాల్సి ఉంది కానీ ఎవరు మీరు కోటీశ్వరులు అనే ఒక గేమ్ షో కూడా ఆయన చేస్తున్న కారణంగా ఆయన వెకేషన్ కి వెళ్ళ లేకపోయారు.

షో షూటింగ్ పూర్తవడంతో
ఈ షో షూటింగ్ కూడా ఈ మధ్యనే పూర్తయింది ఇక కొరటాల శివ సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం ఉండటంతో ఆయన వెకేషన్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది అంటే దాదాపు నెలన్నర పైగా ఇప్పుడు ఎన్టీఆర్ ఖాళీగా ఉంటారు.

ఫారెన్ వెకేషన్ కు
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ని తీసుకొని విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. తన భార్య ఇద్దరు కుమారులు తీసుకుని ఆయన మాల్దీవ్స్ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా మాల్దీవ్స్ రొటీన్ అయిపోయాయి కాబట్టి వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉందని కూడా ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30వ సినిమా లో హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended Video

42 రోజుల లాంగ్ షెడ్యూల్
అయితే దీని మీద ఇంకా అలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మరో ప్రచారం కూడా ఉంది. అలావుంచితే సినిమా షూటింగ్ అయితే ఇక్కడ జరగదని అధిక భాగం ఈజిప్ట్ లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సుమారు 42 రోజుల లాంగ్ షెడ్యూల్ ఈజిప్ట్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇంకా ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన పూర్తిగా ఖాళీ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈజిప్టు బయలు దేరి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఎన్టీఆర్ లాంగ్ బ్రేక్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎవరు మీరు కోటీశ్వరులు రెండో సీజన్ చేయకపోవచ్చని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











