»   » రాజమౌళి మూవీ: భిన్నంగా రామ్ చరణ్ పాత్ర, ఎన్టీఆర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్?

రాజమౌళి మూవీ: భిన్నంగా రామ్ చరణ్ పాత్ర, ఎన్టీఆర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
మళ్ళీ నెగెటివ్ పాత్రలో ఎన్టీఆర్ !

టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో మోస్ట్ హాటెస్ట్ కాంబినేషన్ ఇది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

 బాక్సింగ్ నేపథ్యంలో?

బాక్సింగ్ నేపథ్యంలో?

ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని, ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సర్లుగా కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ కూడా బాక్సింగ్ క్రీడను గుర్తు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.

 రామ్ చరణ్ పాత్ర విభిన్నంగా

రామ్ చరణ్ పాత్ర విభిన్నంగా

ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రను రాజమౌళి విభిన్నంగా ప్రజెంట్ చేయబోతున్నాడని, అతడి కెరీర్లోనే ఎప్పటికీ నిలిచి పోయే విధంగా రాజమౌళి అతడి పాత్రను డిజైన్ చేస్తున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

 ఎన్టీఆర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్

ఎన్టీఆర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్

అయితే ఎన్టీఆర్ పాత్ర నెగటివ్‌ షేడ్స్‌తో సాగుతుందని, ఒకరకంగా చెప్పాంటే కాస్త విలనిజాన్ని తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఇంతకు ముందు ఎన్టీఆర్ ‘జై లవకుశ' మూమూవీలోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 ఎవరూ తక్కువ కాకుండా జాగ్రత్తలు

ఎవరూ తక్కువ కాకుండా జాగ్రత్తలు

సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లు సమానంగా ఉండేలా రాజమౌళి స్క్రిప్టు రెడీ చేస్తున్నారట. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏమాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా చూపించబోతున్నారట. ఏది ఏమైనా సినిమాపై రాజమౌళి తరుపు నుండి అఫీషియల్‌గా సమాచారం వస్తే తప్ప ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

English summary
Rumours and an innumerable number of speculations on Tollywood’s Biggest Multi-Starrer, the forthcoming project of Rajamouli with NTR and Ram Charan when it’s officially announced. Film Nagar source said that, Ram Charan is Hero, NTR is Villain in this Film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu