'జనతా గ్యారేజ్' లాస్ట్ మినిట్ లో వాయిదా

By Srikanya

హైదరాబాద్ :ఎన్టీఆర్ హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ డారక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నిత్యమీనన్, సమంతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెల 10 నుండి ఆరంభం కావలసివుంది, కానీ వాయిదాపడింది.

గ్యారేజ్ కు సంబందించి సెట్ నిర్మాణం ఇంకా పూర్తికానందున ఫిబ్రవరి 25కు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్టు సమాచారం. మెహనలాల్ ఈ సినిమాలో మెదటి షెడ్యూల్ నుండే ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ పాల్గోనున్నాడు. ఇందులో లాల్ ది కీ రోల్ అని తెలుస్తోంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మెదలుపెట్టినట్టు దేవీశ్రీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఎన్టీఆర్ సినిమాలు ఓఎవర్సీస్ లో రూ. 5 కోట్ల మించి అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. అయితే ‘జనతా గ్యారేజ్' చిత్రానికి మాత్రం రూ. 7 కోట్లు ఇస్తానని ఓ బయ్యర్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కు ఫాలోయిగ్ ఏ రేంజిలో అర్థం చేసుకోవచ్చు.

NTR Janata Garage regular shoot delay

జనతా గ్యారేజ్ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తారని, ఇందులో మెకానిక్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ లో కీలకపాత్రలో మెహన్ లాల్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కేరళనుండి మరో యంగ్ హీరో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఇతని పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు కేరళ స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X