ముకుంద తర్వాత ఎన్టీఆర్ యేనా?
హైదరాబాద్ : మాస్ చిత్రాలు చేయటంలో తనదైన మార్క్ చూపించే నటుడు జూ.ఎన్టీఆర్. ఆయన తాజాగా మరో చిత్రం కమిటవుతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు.. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తన శైలి చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో.
క్లాస్ సినిమాను అందరికీ నచ్చేలా తీస్తారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను 'ముకుంద'గా చూపించబోతున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇటీవల ఎన్టీఆర్, శ్రీకాంత్ అడ్డాల మధ్య కథాచర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తాజా చిత్రం 'రభస' నెలాఖరున విడుదల కాబోతోంది. దాని తరవాత పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా ఎప్పుడన్నది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











