కన్ఫర్మ్ :చొక్కా విప్పి..సిక్స్ ప్యాక్ తో జూ.ఎన్టీఆర్
ఈ సిక్స్ ప్యాక్ కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిటినెస్ ట్రైనర్...John Shumate ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బాద్షాలో చేసిన అజీజ్ ఖాన్..ఎన్టీఆర్ కు ఈ ట్రైనర్ ని పరిచయం చేసారు. అజీజ్ ఖాన్ మాట్లాడుతూ..." ఎన్టీఆర్ తన ఫిజిక్ ఫిటినెస్ కోసం చాలా శ్రద్దగా వర్కవుట్స్ చేస్తున్నారు. ఆయన మంచి ట్రైనర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో జాన్ పేరుని నేను ప్రపోజ్ చేసాను. ఎన్టీఆర్..ఫ్యాన్స్ కు ఇది పండుగలా ఉంటుంది" అన్నారు.
ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్..యూనిట్ తో కలిసి నెక్స్ట్ వీకెండ్ మలేషియాకు వెళ్ళనున్నారు. అక్కడ చిత్రంలో మేజర్ సీన్స్ షూట్ చేసుకుని వస్తారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.
మరోసారి ఎన్టీఆర్ వినోదం, యాక్షన్ కలగలిపిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రమిది. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. సమంత హీరోయిన్. శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో హీరో,హీరోయిన్స్ పై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.


Click it and Unblock the Notifications












