సుకుమార్ కి ఎన్టీఆర్ వార్నింగ్
ఎన్టీఆర్ రీసెంట్ గా సుకుమార్ పై సీరియస్ అయ్యి బయిటకు తోసేసాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించింది. సుకుమార్ కి ఎన్టీఆర్ తో ఏం పని అని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏమిటీ అంటే సుకుమార్ అంటే దర్శకుడు సుకుమార్ కాదు ఎన్టీఆర్ పర్శనల్ మేనేజర్ పోలవరపు ఆనంద సుకుమార్. అతను గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ పేరుని దుర్వినియోగం చేస్తున్నాడని, దీనిపై ఎన్టీఆర్ రెండు మూడు సార్లు సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా సాక్షి దినపత్రికలో ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంశి మధ్య గొడవలు వచ్చాయంటూ న్యూస్ వచ్చింది. అది చూసిన ఎన్టీఆర్ వెంటనే ఎంక్వైరీ ప్రారంభిస్తే ఆ న్యూస్ బయిటకు రావటానికి కారణం సుకుమార్ అని తేలింది. దాంతో రాపిడ్ యాక్షన్ కి ఎన్టీఆర్ దిగారు. వెంటనే అతనిని ఆ పదివినుంచి తొలిగించి ఎప్పుడూ మొహం చూపించవద్దని బయిటకు పంపేసారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











