Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ కారణంగా అల్లు అర్జున్, రాజమౌళి సినిమాలపై ప్రభావం.. మధ్యలో మహేష్ కూడా..
బిగ్ బడ్జెట్ సినిమాల విషయంలో ఎంత ప్లాన్ చేసినా కూడా అనుకున్న సమయానికి ఏ పనులు కూడా పూర్తవ్వవు. సినిమాను ఎంత గ్రాండ్ గా లాంచ్ చేసినా కూడా అది పూర్తయ్యే వరకు నమ్మకం ఉండదు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో అదే జరిగింది. సినిమా ఆల్ మోస్ట్ మొదలవుతోందని అనుకున్న సమయంలో ఊహించని విధంగా వాయిదా పడింది. ఇక ఎన్టీఆర్ కారణంగా అల్లు అర్జున్, రాజమౌళి వంటి వారి భవిష్యత్తు సినిమాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ట్విస్ట్ ఇవ్వడంతో..
అరవింద సమేత అనంతరం మరో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మరో సినిమా చేయనున్నట్లు ఏడాది క్రితం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో సినిమాను స్టార్ట్ చేయబోతున్నారని అనుకున్న సమయంలో మొత్తానికి ఎన్టీఆర్ ట్విస్ట్ ఇవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది.
ఈ నిర్ణయం వలన..
ఎన్టీఆర్ ప్రాజెక్టు నుంచి తప్పుకోని కొరటాల శివను లైన్ లో పెట్టాడు. 30వ సినిమాపై అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడంతో త్రివిక్రమ్ తో ఇప్పట్లో అయితే సినిమా లేదని అర్థమైపోయింది. అయితే ఎన్టీఆర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో గాని.. ఈ నిర్ణయం వలన అగ్ర హీరోలు దర్శకులు మళ్ళీ భవిష్యత్తు ప్రణాళికలను మార్చాల్సి వస్తోంది.
అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా?
ముందుగా కొరటాల శివను ఒప్పించి 30వ సినిమాను సెట్ చేసుకోవడం వలన అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా కూడా వాయిదా పడింది. బన్నీతో ఒక పొలిటికల్ సినిమాను ప్లాన్ చేసుకున్న కొరటాల శివ ఆ సినిమాను ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు.
లైన్ లోకి వకీల్ సాబ్ దర్శకుడు
కొరటాలను లాగేసుకోవడం వలన బన్నీ పుష్ప అనంతరం మళ్ళీ గ్యాప్ తీసుకుంటాడా? లేక వేరే దర్శకుడిని లైన్ లో పెడతాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. అతను వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని పుష్ప అనంతరమే స్టార్ట్ చేయావచ్చని టాక్.
రాజమౌళి మహేష్ కాంబో..?
ఇక ఎన్టీఆర్ తప్పుకోవడంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఒక సినిమాను ఫిక్స్ చేసుకునే పనిలో పడ్డాడు. రేపో మాపో ఆ సినిమా అప్డేట్ రావచ్చు. అయితే ఆ సినిమా వలన మహేష్ రాజమౌళి సినిమా మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ లేకపోలేదు. RRR ఆలస్యం అయితే పరవాలేదు గాని ఆ సినిమా అనుకున్న సమయానికి వస్తే రాజమౌళి మహేష్ కోసం మరో ఏడాది వేయిట్ చేయక తప్పదు. మరి ఈ కన్ఫ్యూజన్ పై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.