twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణంగా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు.. వర్మ ట్వీట్‌తో కలకలం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!

    |

    Recommended Video

    NTR Mahanayakudu Getting Weak Collections In 3 Days At Box Office | Filmibeat Telugu

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ చిత్రానికి సంబంధించిన వసూళ్లు చాలా దారుణంగా ఉండటం చిత్ర యూనిట్‌కు, తెలుగు దేశం పార్టీ శ్రేణులకు చేదు అనుభవాన్ని మిగిల్చుతున్నది. ఈ నేపథ్యంలో మహానాయకుడు సినిమాను భుజాన ఎత్తుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేమిటంటే..

    రాంగోపాల్ వర్మ ట్వీట్‌తో

    రాంగోపాల్ వర్మ ట్వీట్‌తో

    ఎన్టీఆర్: మహానాయకుడు సినిమా కలెక్షన్లు దారుణంగా ఉండటంతో ట్రేడ్ వర్గాలను ఆశ్చార్యానికి గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో మహానాయకుడు కలెక్షన్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంకేతం అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

    ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి

    ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి

    ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రంపై వ్యతిరేక ప్రచారం ఊపందుకోవడంతో ఏపీ సీఎం రంగంలోకి దిగాడట. పార్టీ, సినిమాను గట్టెక్కించే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రబాబు సినిమాను ప్రమోట్ చేసే విధంగా చర్యలు తీసుకొంటున్నారట.

    50 రోజులపాటు ఆడించండి

    50 రోజులపాటు ఆడించండి

    ఏపీ సీఎంవో వర్గాలు తెలిపినట్టు ప్రచారంలో కథనం ప్రకారం.. ఎన్టీఆర్: మహానాయకుడు ప్రదర్శించే సినిమా హాళ్ల బాధ్యతను పార్టీ వర్గాలకు అప్పగించారని, ఏప్రిల్ వరకు 50 రోజులు ఆడేంత వరకు థియేటర్లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను వారినే చూసుకోమన్నట్టు తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    కార్యకర్తలందరూ సినిమా చూడాలని

    కార్యకర్తలందరూ సినిమా చూడాలని

    ఇక ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం 50 రోజుల ఆడే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించడంతో టిక్కెట్ల కొనుగోలు వ్యవహారం వారు చేపట్టినట్టు సమాచారం. పార్టీ కార్యకర్తలందరూ, వారి కుటుంబాలు ఎన్టీఆర్: మహానాయకుడు సినిమాను చూడాలని అంతర్గతంగా సమాచారాన్ని పార్టీ వర్గాల నుంచి ఆదేశాలు వెళ్లయట.

    యాత్ర మూవీ ఫార్మూలా అమలు

    యాత్ర మూవీ ఫార్మూలా అమలు

    ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బయోపిక్‌ సినిమాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాకు సంబంధించి కలెక్షన్లు తొలుత అంతంత మాత్రంగానే ఉండటంతో పార్టీ నేతలు రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చాయి.

    English summary
    NTR: Mahanayakudu getting lukewarm response at box office. In this situation, Chandrababu wants run this movie for 50 days. Reports suggest that, CMO order party cadre to buy ticket and go watch for movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X