twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ వేళ బయ్యర్లకు షాక్... బాలయ్య మాట నిలబెట్టుకోవడం లేదా?

    |

    ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయుకుడు' సంక్రాంతికి విడుదలవ్వగా... డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. సెకండ్ పార్ట్ రిలీజ్ నేపథ్యంలో ఇటీవల నిర్మాతలు, బయ్యర్ల మధ్య చర్చలు జరిగాయని... మొదటి భాగం వల్ల ఏర్పడ్డ నష్టాలను బాలయ్య కూడా కొంత భరించడానికి సిద్ధమయ్యారని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి.

    'ఎన్టీఆర్-మహానాయుడు' సినిమా ద్వారా వచ్చే రెవెన్యూలో 40 శాతం బయ్యర్లకు ఇచ్చి వారి నష్టాలను కొంతమేర పూడ్చడానికి బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నిర్ణయంపై ట్రేడ్ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.

    రిలీజ్ వేళ బయ్యర్లకు షాక్..

    రిలీజ్ వేళ బయ్యర్లకు షాక్..

    ‘ఎన్టీఆర్-మహానాయుడు' నిర్మాతల నుంచి భరోసా రావడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు విడుదలకు అంతా సిద్దం చేశారు. అయితే తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఓ న్యూస్ వారిని ఆందోళనలో పడేసింది.

    రీ ఫండ్ లేదు, కమీషన్ మాత్రమేనా?

    రీ ఫండ్ లేదు, కమీషన్ మాత్రమేనా?

    తొలి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' నష్టాలకు ఎలాంటి రీఫండ్ ఉండదని, ‘ఎన్టీఆర్-మహానాయుడు' వచ్చే రెవెన్యూలో కమీషన్ మాత్రమే ఉంటుందని నిర్మాతల నుంచి మెసేజ్ అందినట్లు టాక్. ఈ విషయం తెలిసి అంతా షాకవుతున్నారట.

    బాలయ్య మాట నిలబెట్టుకోలేదనే ప్రచారం..

    బాలయ్య మాట నిలబెట్టుకోలేదనే ప్రచారం..

    ఈ విషయంలో సరైన క్లారిటీ లేక పోవడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో అయోమయం నెలకొని ఉంది. మరో వైపు బాలయ్య మాట నిలబెట్టుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అనేది చర్చనీయాంశం అయింది.

    ‘ఎన్టీఆర్-మహానాయకుడు'

    ‘ఎన్టీఆర్-మహానాయకుడు'

    బయోపిక్ రెండో భాగమైన ‘ఎన్టీఆర్-మహానాయకుడు'పూర్తిగా ఎన్టీ రామారావు రాజకీయ జీవితాన్ని ఫోకస్ చేస్తూ సాగుతుంది. ఆయన పార్టీ స్థాపించడం మొదలు... ముఖ్య మంత్రి పదవి చేపట్టడం, ఆతర్వాత ఎదుర్కొన్న రాజకీయ పరిణామాలు ఇందులో చూపించనున్నారు.

    English summary
    'NTR Mahanayakudu' distributors are reportedly got the information that they will only get the commission but no refund for NTR Kathanayakudu losses. Upon learning this, the buyers left in shock.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X