బిజినెస్ ఎఫెక్టేనా?... ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ వాయిదాకు కారణమేంటి?
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న సంక్రాంతి సందర్భంగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదల చేయగా.. రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు' ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎన్టీఆర్-మహానాయుకుడు' ఫిబ్రవరి 7న రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్లనే వాయిదా పడిందని, ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కారణం ఏమిటి?
అయితే సినిమా రిలీజ్ డేట్ ఉన్నట్టుండి వాయిదా పడటానికి కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షూటింగ్ పూర్తికాలేదని, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని... రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి భాగం వసూళ్లు దారుణంగా
హైప్ బాగా ఉండటంతో మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' దాదాపు రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే తొలి వారం రూ. 20 కోట్ల షేర్ కూడా వసూలు కాలేదు. సినిమా టాక్ బావున్నప్పటికీ, క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ... కలెక్లన్ల పరంగా డిజాస్టర్ అని తేలిపోయింది.

భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు
మొదటి భాగం సరైన వసూళ్లు లేక భారీగా నష్టాలను మిగిల్చే పరిస్థితిలోకి వెళ్లడంతో... రెండో భాగానికి బిజినెస్ కావడం కష్టంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని మొదటి భాగం స్థాయిలో భారీ ధరకు కొనుగోలు చేసేందుక భయపడుతున్నారట. సినిమా వాయిదా పడటానికి కారణం అదే అనే ప్రచారం జరుగుతోంది.

రెండో భాగంలో...
‘ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రం పార్టీ స్థాపించడంతో ముగుస్తుంది. రెండో భాగంలో పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తీరు, అధికారం చేపట్టాక తెలుగు ప్రజల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ ఏం చేశారు అనేది చూపించబోతున్నారు.

ఆ మ్యాటర్ లేక పోవడం కూడా...
‘ఎన్టీఆర్-మహానాయకుడు'లో మహానేత జీవితంలోని కొన్ని వివాదాస్పద సంఘటనలు ఉండవని తేలిపోయింది. చాలా మందికి తెలియని ఎన్టీఆర్ జీవితాన్ని చూపించిన మొదటి భాగానికే అంతగా ఆదరణలేని పరిస్థితుల్లో.... అందరికీ తెలిసిన రాజకీయ తెరంగ్రేటం అంశాలు చూపే ‘మహానాయకుడు' పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











