twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్,మహేష్ ...ఇద్దరూ కలిసి

    By Srikanya
    |

    హైదరాబాద్: ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి మల్టి స్టారర్ చిత్రానికి పనిచెయ్యటం లేదు. వీరిద్దరు కలిసి రాబోయే ఎలక్షన్స్ లో టీడిపి తరపున ప్రచారం చేయనున్నారు. మహేష్ బావ గల్లా జయదేవ్ రీసెంట్ గా తెలుగు దేశంలో జాయిన్ అయ్యారు. గల్లా జయదేవ్ గుంటూర్ ప్రాతం నుంచి ఎంపి అభ్యర్దిగా నిలబడబోతున్నారు. అలాగే మరో ప్రక్క కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు సైతం తెలుగు దేశం నుంచి తెనాలి నియోజక వర్గం నుంచి నిలబడుతున్నారు. దాంతో వీరిద్దరి ప్రచార భాధ్యత మహేష్ పై పడింది. ఇప్పటికే వీరికి ప్రచారం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం.

    NTR & Mahesh coming together

    అలాగే ఎన్టీఆర్ ఇప్పటిగే తెలుగుదేశం ప్రచారం నిమిత్తం ఇరవై రోజులు పాటు సమయం కేటాయించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తెలుగు దేశంకు రెండు వైపులా ప్రచారం చేయనున్నారు. దీనికి తోడు ఎలాగో లెజండ్ తో సిద్దమవుతున్న బాలకృష్ణ సైతం టీడీపి ప్రచారానికి తనదైన శైలిలో సిద్దమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా చాలా మంది ఈ పొలిటికల్ క్యాంపైన్స్ లో పాల్గొంటున్నా మహేష్, ఎన్టీఆర్ పాల్గొని ప్రచారం చేయటం మాత్రం పార్టీకి బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

    ఇక రానున్న ఎన్నికల్లో బాలకృష్ణ పోటీచేస్తారా అన్న విలేకర్ల ప్రశ్నకు బాబు స్పందిస్తూ.. ఆయన పోటీచేస్తానంటే ఎమ్మెల్యే/ఎంపీ టికెట్‌ ఇస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అభిమానులు అడుగుతున్నారు కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ''అభిమానుల గురించి నేను మాట్లాడడం లేదు. రేపు ఎవరో వచ్చి నీక్కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని అడగొచ్చు. తెలుగుజాతిని ఈ క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది'' అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరెవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించేందుకు సిద్దంగా ఉందన్నారు. పార్టీలోకి మంచివాళ్లనే చేర్చుకుంటున్నామని, ఎవరొచ్చినా కార్యకర్తలకు తొలి గౌరవం ఉంటుందని చెప్పారు.

    English summary
    As two of his closest family members will be contesting in the coming elections, Mahesh Babu might be joining the campaigning very soon. On the other hand, Junior NTR has given a green signal to the campaigning part for TDP and already allotted 20 days for political campaign in both regions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X