NTR Neel: ఎన్టీఆర్ సినిమాలో మరో స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్లానింగ్ వేరే లెవెల్!

NTR Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 'ఎన్టీఆర్-నీల్' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిమానులు 'NTR31'గా పిలుస్తున్నారు. మేకింగ్ స్పీడ్ నెమ్మదిగా ఉన్నా, అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ప్రశాంత్ నీల్ తన మార్క్ ప్లానింగ్‌తో సినిమాను రూపొందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ మ్యాటరేంటీ?

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీపై బారీ హైప్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది 'వార్ 2' మిక్స్‌డ్ టాక్‌తో ఎన్టీఆర్ అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, ప్రశాంత్ నీల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మాత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 'దేవర' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఫోకస్ మరింత పెరిగింది. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ అయిన అది ఇట్లే వైరల్ అవుతుంది.

NTR Neel Movie Tovino Thomas Viral Training Video Sparks Massive Buzz Around NTR31 Dragon

తాజా అప్డేట్ ప్రకారం.. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) కీలక పాత్రలో నటిస్తున్న తెలుస్తోంది. అయితే తాజాగా టోవినోకు సంబంధించిన ఓ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టోవినో తన సాలిడ్ ఫిట్నెస్ లెవెల్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ నంచక్‌తో విన్యాసాలు చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ ట్రైనింగ్ మొత్తం ఎన్టీఆర్ సినిమా కోసమేనా? లేక మరో ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాడా? అనే చర్చ మొదలైంది. కానీ, ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారన్న పేరును చూస్తే, టోవినో పాత్ర కూడా హై ఇంటెన్సిటీతో ఉండబోతుందన్న భారీ అంచనాలు నెలకొన్నాయి.

మలయాళంలో ' మిన్నల్ మురళి'లాంటి చిత్రాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న టోవినో థామస్, ఇప్పుడు ఎన్టీఆర్‌కు ఢీ కొట్టే పాత్రలో కనిపిస్తాడన్న టాక్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఎన్టీఆర్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌కు, టోవినో నేచురల్ యాక్టింగ్ తోడైతే.. వెండితెరపై వచ్చే ఫేస్ ఆఫ్ సీన్లు ఓ యుద్ధంలా ఉండబోతాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరగనుంది. ఫిబ్రవరి 5 నుంచి జోర్డాన్‌లో కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించేందుకు యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జోర్డాన్ స్థానిక ప్రభుత్వం కూడా షూటింగ్‌కు పూర్తి సహకారం అందిస్తుందని తెలుస్తోంది. మరోవైపు, షూటింగ్ ప్రారంభానికి 2-3 రోజుల ముందే ఎన్టీఆర్ అక్కడికి చేరుకుని వాతావరణానికి అలవాటు పడటంతో పాటు తన పాత్రకు సంబంధించిన మేకోవర్‌పై దృష్టి పెట్టనున్నారని సమాచారం.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామాగా కూడా ఈ సినిమా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. 'డ్రాగన్' అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ - టోవినో థామస్ కాంబినేషన్ థియేటర్లలోకి అడుగుపెడితే, మాస్ మాడ్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X