NtrNeel: ఎన్టీఆర్ సినిమాలో రాజమౌళి హీరోయిన్.. నీల్ మామ స్కెచ్ అదుర్స్

NTR-Neel: జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో డైరెక్టర్‌గా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్ (Dragon). ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే RRR, దేవర వంటి వరుస విజయాలతో ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌లో ఉండగా, KGF, సాలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే,గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్, నటినటుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నట్టు టాక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

ఇక ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపికపై వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా విలన్ పాత్రపై భారీ చర్చ నడుస్తోంది. మొదట మలయాళ స్టార్ టోవినో థామస్ పేరు వినిపించినా, డేట్స్ సమస్యల కారణంగా ఆయన ప్రాజెక్ట్‌కు దూరమైనట్లు టాక్. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ (Shahid Kapoor) పేరు బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, ఎన్టీఆర్ - షాహిద్ కపూర్ మధ్య స్క్రీన్ వార్ చేస్తే ప్రధాన హైలైట్‌గా మారే అవకాశం ఉంది.

NTR-Neel s Dragon Alia Bhatt Onboard Shahid Kapoor as Villain Major Buzz

ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏలియా భట్ కూడా పాత్రలో కనిపించిన ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో RRRలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అలియా, ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో కనిపించనున్నట్టు టాక్ రావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నాయి. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతతో ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా రాజమౌళి హీరోయిన్ అలియా భట్ .. ప్రశాంత్ నీల్ మూవీలో పార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమని అభిమానులు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో "షూటింగ్ ఆగిపోయింది", "హీరో-డైరెక్టర్ మధ్య విభేదాలు" వచ్చిన వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇది కేవలం షెడ్యూల్ గ్యాప్ మాత్రమేనని మైత్రీ మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పష్టం చేశాయి. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం ప్రతి షెడ్యూల్‌కు మధ్య విరామం తీసుకోవడం సాధారణమేనని.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ వేగంగా సాగుతోంది. మొత్తంగా చూస్తే 'డ్రాగన్' సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ యాక్షన్ స్పెక్టకిల్‌గా నిలవబోతోందని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్‌లో, రగ్గడ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే లీకైన కొన్ని లుక్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.

ముఖ్యంగా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, ఈ సినిమా కథ పరిమాణం దృష్ట్యా రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన కూడా మేకర్స్ వద్ద ఉన్నట్లు ఉంది. మొత్తంగా చూస్తే 'డ్రాగన్' సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read more about: jr ntr alia bhatt prashanth neel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X