NTR Neel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్' టీమ్!

NTR- Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)- మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్). వీరిద్దరి కాంబో ప్రకటించిన నాటి నుంచి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ యూనిట్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందట. అసలేం జరిగిందంటే?

మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్టన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మాస్ యాక్షన్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ కలయికగా తెరకెక్కుతుండటంతో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులకు రా యాక్షన్ ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్‌ మించిన వారు లేరని టాక్.. అలాంటి డైరెక్టర్ యాక్షన్ సన్నివేశాలను గ్రాండ్‌గా, ఇంటెన్స్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

NTR-Neel s Dragon Team Escapes Iran-Israel War Tensions Wraps Jordan Schedule Safely

జోర్డాన్ షెడ్యూల్
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ టీమ్ జోర్డాన్ షూటింగ్ చేసింది. జోర్డాన్ ఎడారి ప్రాంతాల్లో సినిమాకు హైలైట్‌గా నిలిచే మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. ఎడారి నేపథ్యంలో రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ ట్రీట్‌మెంట్‌తో ప్రశాంత్ నీల్ సన్నివేశాలను తెరకెక్కించారని టాక్. ఎన్టీఆర్ ఎటువంటి డూప్ లేకుండా కొన్ని రిస్కీ స్టంట్స్ స్వయంగా చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. ఒక మాస్ సాంగ్‌ను కూడా అక్కడి గ్రాండ్ లొకేషన్లలో షూట్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ చర్యలతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో 'డ్రాగన్' యూనిట్ జోర్డాన్ ఎడారి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుండటం టాలీవుడ్‌లో కలకలం రేపింది. అయితే, పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ప్రశాంత్ నీల్ టీమ్ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగివచ్చినట్టు తెలుస్తోంది.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చిన వేళ డ్రాగన్ టీం అప్రమత్తమైంది. జోర్డాన్ షెడ్యూల్ మార్చి మొదటి వారం వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తలతో ఫిబ్రవరి 22 నాటికే షెడ్యూల్ పూర్తి చేసి భారత్‌కు చేరుకుందట. ఇక ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు దేశీయ లొకేషన్లలోనే జరపనున్నారు. అనంతరం పోస్టు ప్రొడక్షన్స్ వర్స్ పూర్తి చేసుకుని ఈ మూవీ జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఇలా యుద్ధ వాతావరణం మధ్య తృటిలో తప్పిన ప్రమాదం 'డ్రాగన్' యూనిట్‌కు ఊరట ఇచ్చింది.

More from Filmibeat

Read more about: prashanth neel ntr dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X