ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం టైటిల్ ఇదేనా?

By Srikanya

హైదరాబాద్ : హరీష్ శంకర్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఇప్పటివరకూ ఖరారు చెయ్యలేదు. అయితే తాజాగా ఓ టైటిల్ ఈ చిత్రానికి పెట్టారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ ఏమిటంటే...'రామయ్యా వస్తావయ్యా'. ఇదే టైటిల్ తో ప్రభుదేవా ప్రస్తుతం నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం మార్చి 20 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్..ఎన్టీఆర్ సరసన మంచిపాత్రలో కనిపించనుంది. సమంత మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో స్టూడెంట్ గా యంగ్ లుక్ తో ఎన్టీఆర్ కనిపిస్తాడని వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ పై బాద్షా చిత్రం విడుదల తర్వాత ప్రకటన రానుంది.

ఇక ఆ మధ్యన హరీష్ శంకర్..పండుగ చేసుకో అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారు. దాంతో ఎన్టీఆర్ చిత్రం టైటిల్ పండగ చేసుకో అని మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. ఈ విషయమై హరీష్ శంకర్ ట్విట్టర్ లో క్లారిఫికేషన్ ఇచ్చారు. హరీష్ శంకర్ ఇచ్చిన ట్వీట్ లో... " గయ్స్ స్మాల్ క్లారిఫికేషన్... "పండుగ చేసుకో" అనేది మా సినిమా టైటిల్ కాదు బాద్షా చిత్రం విడుదల తర్వాత ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేస్తాం " అన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X