బిగ్ బాస్-2కు ఎన్టీఆర్ బిగ్ షాక్.... కారణం ఆ ఇద్దరే?

By Bojja Kumar

తెలుగులో ప్రారంభమైన 'బిగ్ బాస్' రియాల్టీ షో భారీ టీఆర్పీ రేటింగులతో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు స్థాయి రేటింగ్స్ సాధించింది. ఈ షో ఇంత పెద్ద హిట్టయిందంటే దానికి ప్రధాన కారణం..... టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయడమే. అప్పటి వరకు తెలుగులో ఎన్టీఆర్ కంటే పెద్ద హీరోలు హెస్ట్ చేసిన ఇతర రియల్టీ షోలు ఉన్నప్పటికీ ఆ షోలను మించి బిగ్ బాస్ హిట్ అయింది. తారక్ హోస్ట్ చేసి ఉండక పోతే అంత సక్సెస్ వచ్చేది కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

Recommended Video

Bigg Boss Telugu Season 2 waiting for NTR
 బిగ్ బాస్-2కు బిగ్ షాక్

బిగ్ బాస్-2కు బిగ్ షాక్

బిగ్ బాస్ తొలి సీజన్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తారక్ హోస్ట్‌గా కొనసాగించాలని నిర్వాహకులు భావించారు. అప్పుడు సూచన ప్రాయంగా ఓకే చెప్పిన ఎన్టీఆర్.... ఇపుడు తన వల్ల కాదు అంటూ షాకిచ్చినట్లు సమాచారం.

 మొన్నటి వరకు అలా, ఇపుడు ఇలా

మొన్నటి వరకు అలా, ఇపుడు ఇలా

కొన్ని రోజుల క్రితం వరకు ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్ బాస్-2 ప్రారంభం అవుతుందని, ఈ సారి 70 కాదు 100 రోజుల అని వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు తారక్ ఈ షో చేయడం లేదు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. మరి ఇందులో ఏది నిజం అనేది తేలాల్సి ఉంది.

 ఆ ఇద్దరే కారణం...

ఆ ఇద్దరే కారణం...

తారక్ బిగ్ బాస్ రెండో సీజన్లో పాల్గొనను అని చెప్పడానికి కారణం.... ఇద్దరు డైరెక్టర్లే అని తెలుస్తోంది. వారు మరెవరో కాదు త్రివిక్రమ్, రాజమౌళి. వారితో సినిమాలు కమిటవ్వడం, బిగ్ బాస్-2 చేసుకునే గ్యాప్ వారు ఇచ్చే అవకాశం లేక పోవడంతో తారక్ వెనక్కు తగ్గాడట.

అపుడు హోం బ్యానర్ కాబట్టే వీలైంది

అపుడు హోం బ్యానర్ కాబట్టే వీలైంది

బిగ్ బాస్ సీజన్ 1 సమయంలో ఎన్టీఆర్ తన హెమ్ బ్యానర్, అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కువ' చిత్రం చేస్తున్నాడు. తన సొంత బేనర్ కాబట్టి అపుడు తనకు అనుగుణంగా డేట్స్ సెట్ చేసుకుని బిగ్ బాస్ షో చేశాడు ఎన్టీఆర్. అయితే ఇపుడు చేస్తున్న సినిమాలు బయటి బేనర్లో కాబట్టి సర్దుబాటు అవకాశం లేదని టాక్.

 ఎన్టీఆర్ లేకుండా ఊహించలేం

ఎన్టీఆర్ లేకుండా ఊహించలేం

ఎన్టీఆర్ లేకుండా బిగ్ బాస్ షోను ఊహించడం కష్టమే. తెలుగు ప్రేక్షకుల మనసులో బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే బిగ్ అనే ముద్ర పడింది. ఆ స్థానాన్ని వేరే హీరోతో రీప్లేస్ చయడం అంత ఈజీ కాదు. ఎన్టీఆర్ లేక పోవడం కూడా అభిమానులను నిరాశ పరిచే విషయమే.

త్రివిక్రమ్, రాజమౌళితో ఎన్టీఆర్ సినిమాలు

త్రివిక్రమ్, రాజమౌళితో ఎన్టీఆర్ సినిమాలు

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X