'మెమరీ లాస్' కథతో ఎన్టీఆర్ చిత్రం
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న ఊసరవిల్లి చిత్రం మెమరీలాస్ పాయింట్ ని బేస్ చేసుకుని నడవనుందని విస్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో తమన్నా కి మెమరీ లాస్ వస్తుందని, అది ఇంటర్వెల్ కి రివిల్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఆమెను సేవ్ చేసే ఆమెకు చెందిన పగను తీర్చే ప్రేమికుడుగా ఎమోషన్ కలబోసిన పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ చిత్రం ఓ చైనా చిత్రం సెంట్రల్ పాయింట్ ఆధారంగా తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు.
ఇక గత దసరాకి ఎన్టీఆర్ బృందావనం చిత్రం విడుదలై విజయం సాధించటంతో అదే సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని ఆ సమయానికే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఊసరివిల్లి చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అశోక్ తర్వాత ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కలిపిచేస్తున్న చిత్రం ఇది. కిక్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని మరో బ్లాక్ బస్టర్ గా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











