పవన్ నో ...ఎన్టీఆర్ సై??

By Srikanya

హైదరాబాద్: చాలా కాలంగా తమిళంలో సరైన హిట్‌ కావాలని ఎదురుచూసిన విజయ్, సమంత ఆశలకు జీవం పోసిన సినిమా ‘కత్తి'. ఈ సినిమాలో విజయ్‌ సరసన సమంత నటించింది. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదలై తమిళంలో ఘన విజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాను తెలుగుల రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సైతం చూసారు. అయితే ఆయన నో చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో డబ్బింగ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఆ పనులు సైతం మొదలయ్యాయి.

అయితే తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాత ఠాగూర్ మధు మాత్రం దాన్ని స్ట్రైయిట్ గా చేసి హిట్ కొట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు వినికిడి. అందుకోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు సమాచారం. ఇద్దరూ ఈ చిత్రాన్ని చూడనున్నారు. ఎవరికి నచ్చి, మిగతా టెర్మ్స్ లు నచ్చితే వారితో ప్రొసీడ్ అయిపోతారు. దాంతో నవంబర్ 21 న విడుదల కావాల్సిన తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఆగింది.

 NTR or Allu Arjun in Kaththi remake!

మరో ప్రక్క హిందీలో ఎ.ఆర్‌.మురుగదాస్‌ రీమేక్‌ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌ తో ఈ కథను తెరకెక్కించడానికి మురుగదాస్‌ ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. కానీ ఈ విషయాన్ని మురుగదాస్‌ ఇంకా ధ్రువీకరించలేదు. కానీ రీసెంట్ గా సల్మాన్ ని కలిసి ఈ చిత్రం గురించి డిస్కస్ చేసారని తెలుస్తోంది. సల్మాన్ సైతం దక్షిణాది కథలపై ఆసక్తి ఉన్న హీరో కావటంతో త్వరలోనే సినిమా చూసి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

ఇక మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్‌ స్వరాలు అందించారు.

చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. ''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X