RRR నుంచి బయటపడిన ఎన్టీఆర్.. ఇక రాజమౌళి ఆయనతో!

Recommended Video

#RRRLatest Update || Jr NTR Out, Ram Charan In

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత రాజమౌళి చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా RRR. ఈ సినిమా ప్రకటించిన నాటినుంచే జక్కన్న దర్శకత్వ ప్రతిభ మరోసారి చూడబోతున్నామనే ఉత్సాహం ప్రేక్షక లోకంలో నెలకొంది. ఇక ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారనే అంశం యావత్ తెలుగు ప్రేక్షకుల్లో సంబరాలు నింపింది. ప్రస్తుతం శరవేగంగాషూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది. ఆ వివరాలు చూస్తే..

రామ్ చరణ్, ఎన్టీఆర్ రోల్స్

రామ్ చరణ్, ఎన్టీఆర్ రోల్స్

RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ సమ ప్రాధాన్యమున్న రోల్స్ ఇచ్చారు జక్కన్న. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. చారిత్రక నేపథ్యం, ఇద్దరి క్యారెక్టర్స్ ని రాజమౌళి తీర్చిదిద్దున్న విధానం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

కొద్ది రోజులుగా రామ్ చరణ్

కొద్ది రోజులుగా రామ్ చరణ్

RRR సినిమాలో నటిస్తూనే తండ్రి మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి నిర్మాణ పనులు చూసుకున్నారు రామ్ చరణ్. తండ్రికి కానుకగా ఇస్తున్న సినిమా కావడంతో సైరా పనులపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన రామ్ చరణ్ RRR సెట్స్ కి కాస్త దూరంగా ఉన్నారు. అందుకే రాజమౌళి కూడా రామ్ చరణ్‌ను పూర్తి స్వేచ్ఛగా వదిలి పెట్టారు.

సైరా సక్సెస్ జోష్.. ఇక రామ్ చరణ్

సైరా సక్సెస్ జోష్.. ఇక రామ్ చరణ్

సైరా పనులన్నీ పూర్తిచేసుకొని భారీ రేంజ్‌లో విడుదల కావడం, ఊహించిన దానికి మించి రెస్పాన్స్ తెచ్చుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సో ఇక రామ్ చరణ్ ఫ్రీ అయినట్లే కాబట్టి RRR సెట్స్ పై చురుకుగా పాల్గొనబోతున్నారట. ఈ మేరకు రాజమౌళి నుంచి రామ్ చరణ్‌కి పిలుపు అందిందని తెలుస్తోంది.

రామ్ చరణ్ ఇన్.. ఎన్టీఆర్ అవుట్

రామ్ చరణ్ ఇన్.. ఎన్టీఆర్ అవుట్

రామ్ చరణ్ సైరా పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు జక్కన్న. అలా ఇన్నాళ్లు RRR సెట్స్ మీద జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన రెస్ట్ మోడ్‌లోకి వెళ్తున్నాడు. రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తున్నారు. చెర్రీ రాకతో కొన్ని రోజుల పాటు ప్రాజెక్ట్‌కి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లుగా సమాచారం.

కుటుంబంతో టూర్

కుటుంబంతో టూర్

ఇన్నాళ్లు RRR షూట్ తో బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్.. ఇక కొన్ని రోజులు
తన కుటుంబంతో జాలీగా గడపాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ మేరకు కుటుంబంతో కలిసి ఆయన టూర్ వెళ్ళబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే RRRలో ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ చివర్లోకి వచ్చేసిందని, కాబట్టి ఇక ఎన్టీఆర్ అవసరం ఇప్పట్లో లేదని తెలుస్తోంది.

ఆలియా ఎంట్రీ.. రామ రౌద్ర రుషితం

ఆలియా ఎంట్రీ.. రామ రౌద్ర రుషితం

డివివి దానయ్య సమర్పణలో 300 కోట్ల బడ్జెట్ తో RRR మూవీ తెరకెక్కుతోంది. 2020 జులై 30న ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాతో తెలుగు తెరపై కాలుమోపుతోంది. ఇక చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X