జూ ఎన్టీఆర్ తో ‘పాతాళ భైరవి’త్రీడి..డిటేల్స్
ఎన్టీఆర్ నటించిన సంచలన జానపద చిత్రం 'పాతాళ భైరవి" మరోసారి వెండి తెరకెక్కబోతోంది. అయితే ఈ సారి 3డీ వెర్షన్‌లో ఈ చిత్రం ఉండబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ దృశ్యకావ్య రూపకల్పన కోసం ప్రముఖ దర్శకుడు రాజమౌళి కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో మూడు సంచలన సినిమాలు కూడా రూపొందించారాయన. సాంకేతికంగా ఇదో విజువల్ వండర్ అవుతుందనే టాక్ ఫిలింనగర్‌లో నడుస్తోందప్పుడే. ఇక 1951లో వచ్చిన 'పాతాళ భైరవి" చిత్రం తెలుగు సినిమా స్క్రీన్‌పై అద్భుత దృశ్యకావ్యం చెపుతారు. పింగళి నాగేంద్ర రావు రచన చేసిన ఈ చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా ఘంటశాల సంగీతం అందించారు. విజయ బేనర్ పై నాగిరెడ్డి, చక్రపాణిల ఈ బ్లాక్‌బస్టర్‌ను తెలుగు వారికి కానుకగా ఇచ్చారు. ఈ చిత్రంలోని 'సాహసం సాయరా డింబకా" డైలాగ్ ఇప్పటికీ పాపులరే.
జూ ఎన్టీఆర్ మగధీర యమదొంగ సింహాద్రి 3డి పాతాళభైరవి jr ntr rajamouli magadheera simhadri patala bhairavi


Click it and Unblock the Notifications