జూ ఎన్టీఆర్...కెరీర్లో తొలిసారి ట్రిపుల్ రోల్?

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది.

By Bojja Kumar

హైదరాబాద్: జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో ఎన్టీఆర్ త్రిపుల్ రోల్ చేస్తున్నారని.... కెరీర్లో తొలిసారి ఆయన త్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానబోతున్నాయి.

త్రిపుల్ రోల్ ఎలా ఉండబోతోంది?

త్రిపుల్ రోల్ ఎలా ఉండబోతోంది?

సాధారణంగా తెలుగు సినిమాల్లో త్రిపుల్ రోల్ అంటే... తాత, తండ్రి, కొడుకు ఒకే రూపంలో ఉండటం చూస్తూ ఉంటాం. మరి ఈ సినిమాలోనూ అదే రోటీన్ కాన్సెప్టును త్రిపుల్ రోల్ లో చూపిస్తారా? లేదా? ఇంకేమైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

సంక్రాంతి తర్వాత

సంక్రాంతి తర్వాత

'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ నూతన చిత్రం లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ అనంతరం చిత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. ఆ వెంటనే నిరవధికం గా షూటింగ్ జరుపుకుని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

" సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధం గా ఉంది. వచ్చే సంక్రాంతి సెలవుల అనంతరం చిత్రాన్ని ప్రారంభిస్తాం", అని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు.

త్వరలో పూర్తి వివరాలు

త్వరలో పూర్తి వివరాలు

భారీ తారాగణం తో,విన్నూత్నమైన పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ని నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియ చేయబడతాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X