ఆ చిత్రంలో ఎన్టీఆర్, ప్రభాస్?

ఇక రాఘవేంద్రరావు పరుశరాముడులో కీలక పాత్ర అయిన రాముడుకి ఎన్టీఆర్ ని అడిగినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ ప్రపోజల్ కి సముఖంగానే ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ముందు అదుర్స్ పూర్తి చేయాల్సి ఉంది. దానికే రెస్ట్ అనంతరం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనలని డాక్టర్స్ చెప్తున్నారు. దాంతో ఇది పూర్తయ్యాకే ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పై ఆలోచిస్తారు. ఇక పరుశరాముడుగా ప్రభాస్ ఈ చిత్రంలో కరుణ, రౌధ్ర రసాలను పంచనున్నాడని చెప్తున్నారు.
భారవి రెడీ చేస్తున్న ఈ స్క్రిప్టులో ఈ ఇద్దరు స్టార్ హీరోలు చెయ్యటం మంచి క్రేజ్ తెచ్చే విషయమే. అయితే కొంత మంది ఎన్టీఆర్ శ్రేయాభిలాషులు మాత్రం ఎన్టీఆర్ ని అప్పుడే పౌరాణిక వేషాలు జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది. ఇక గతంలో యమదొంగలో ప్రభాస్ విశ్వామిత్రుడుగా గెస్ట్ గా కనిపించాడు. ఇక ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కి వచ్చింది. అందులోనూ ఇద్దరూ మంచి ప్రెండ్స్ అవటం కూడా ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. పరుశరాముడు క్షత్రియజాతిని సంహరించిన విష్ణుముర్తి అవతారం అని పౌరాణికాలు చెప్తున్నాయి. మరి ఆ తరహా కథకు ఆ కాలంలోకి వెళ్ళి అప్పటి సెట్స్ వేసి రాఘవేంద్రరావు ఎలా తీస్తారన్నిది ఆసక్తికరమే.


Click it and Unblock the Notifications











