NTR Neel: ఎన్టీఆర్ డ్రాగన్‌లో అక్కినేని హీరో.. నీల్ ఏం ప్లాన్ చేసావయ్యా..!
NTR-Prashanth Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్- సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి మాస్ బ్లాక్‌బస్టర్లతో ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్... ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్‌తో ఏ స్థాయి యాక్షన్ డిజైన్ చేస్తారన్నదే సినీ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం జోర్డాన్ ఎడారుల్లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని, ఇటీవల హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. అక్కడ ఎన్టీఆర్‌పై హాలీవుడ్ స్టైల్ ఫైట్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ షూట్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్. ఈ యాక్షన్ బ్లాక్‌లు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

ఎన్టీఆర్ న్యూ లుక్
ఈ మూవీ కోసం ఎన్టీఆర్ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారని ఇప్పటికే అభిమానులకు తెలిసిందే. సరికొత్త హెయిర్ స్టైల్, రగ్గడ్ లుక్‌తో పాటు ఏకంగా 15 కేజీల బరువు తగ్గి పాత్రకు సిద్ధమయ్యారన్న వార్త ఫ్యాన్స్‌లో మరింత ఎగ్జైట్‌మెంట్ పెంచింది.'ఈసారి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది'అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth)నటిస్తుండగా, విలన్ పాత్రలో మలయాళ స్టార్ టోవినో థామస్ (Tovino Thomas)కనిపించనున్నారన్న ప్రచారం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ - టోవినో మధ్య వచ్చే బ్లడీ ఫైట్ సీక్వెన్స్‌లు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
అసలు ట్విస్ట్ ఇదే.. 'డ్రాగన్'లో అఖిల్ అక్కినేని గెస్ట్ రోల్?
ఇదిలా ఉండగా... ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 'డ్రాగన్'లో ఓ యంగ్ హీరో కీలకమైన గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్‌కు అఖిల్ అక్కినేనితో ఇటీవలి కాలంలో మంచి స్నేహం ఏర్పడిందట. కథలో తక్కువ నిడివి ఉన్నప్పటికీ భారీ ఇంపాక్ట్ చూపించే పాత్ర కోసం అఖిల్ అయితే బాగుంటుందని ప్రశాంత్ భావించారట.
అఖిల్ అక్కినేని పాత్ర కథకు కీలక మలుపు తీసుకొచ్చేలా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. అఖిల్‌కు కూడా ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం ఉండటంతో, ప్రశాంత్ నీల్ అడగగానే వెంటనే ఓకే చెప్పేశారనే ప్రచారం వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాకపోయినా, ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ అప్డేట్?
ఇప్పటికే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీ అప్డేట్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారిక టైటిల్ ఏంటీ? ప్రశాంత్ నీల్ మార్క్ రా యాక్షన్ ఎలా ఉండబోతోంది? అఖిల్ నిజంగానే గెస్ట్ రోల్‌లో కనిపిస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఇవన్నీ నిజమైతే ..'డ్రాగన్' క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే ప్రాజెక్ట్‌గా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











