నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ .. మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్..
జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కొరటాల శివతో కొత్త సినిమాను చేయబోతున్నట్లు చెబుతూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 30వ ప్రాజెక్ట్ మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని అనుకున్న తారక్ ఆ తరువాత మనసు మార్చుకొని డైరెక్టర్ ను మార్చేశాడు. ఇక మరికొన్ని రోజుల్లో పుట్టినరోజు సందర్భంగా మరొక కొత్త సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తోంది.

RRRకు ఫీనిషింగ్ టచ్
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ లాంటి మరో అగ్ర హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ సినిమా.. అందుకే రిజెక్ట్?
ఇక RRR లాంటి బిగెస్ట్ మల్టీస్టారర్ అనంతరం చేయాల్సిన సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలని త్రివిక్రమ్ ఫ్యామిలీ డ్రామాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఆ కథ పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తగదనే కారణం వల్లనే రిజెక్ట్ చేశాడట. ఇక కొరటాల చెప్పిన ఒక నేషనల్ కాన్సెప్ట్ పాన్ ఇండియా రేంజ్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని ఫిక్స్ అయ్యాడట.

ప్రశాంత్ నీల్ తో..
ఇక కొరటాల శివ అనంతరం మరొక బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని తారక్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు. ముందుగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
Recommended Video

డేట్ ఫిక్స్ చేసుకున్న తారక్
సలార్ అనంతరం ప్రశాంత్ నీల్ ఫోకస్ అంతా కూడా ఎన్టీఆర్ పైనే ఉంది. అందుకే కొరటాల శివ ప్రాజెక్ట్ తో పాటు ప్రశాంత్ తో కూడా ఒక సినిమాను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సలార్ అనంతరం ఎన్టీఆర్ ప్రాజెక్టు మొదలయ్యే ఛాన్స్ కానుందట.


Click it and Unblock the Notifications











